• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమెరికాలో తుపాకుల గర్జన

అమెరికాలో తుపాకుల గర్జన

By - Tupaki Desk
Update: 2017-06-15 06:04 GMT
తుపాకుల కలకలం అమెరికాలో అత్యంత సాధారణమైపోయింది. నిత్యం ఎక్కడో ఒక చోట తూటాల మోత. తాజాగా మరోసారి అమెరికాలో తుపాకులు గర్జించాయి.  యునైటెడ్ పార్సిల్‌ సర్వీస్ కంపెనీ ప్యాకేజ్‌ సెక్షన్‌ వద్ద ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగి కాల్పులకు తెగబడి ముగ్గురి ప్రాణాలు తీశాడు. అనంతరం అతను కూడా కాల్చుకుని మరణించాడు.
    
శాన్‌ ఫ్రాన్సిస్కోలోని యునైటెడ్‌ పార్సిల్‌ సర్వీస్‌ అనే సంస్థకు చెందిన ఓ ఉద్యోగి కంపెనీ ప్యాకింగ్‌ హబ్‌ వద్దకు వెళ్లి అక్కడ తనతోపాటు పనిచేస్తున్న సహచర ఉద్యోగులపై కాల్పులు జరిపాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుంటుండగానే అదే తుపాకీతో తనకు గురిపెట్టుకొని కాల్చుకున్నాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. మొత్తం 350మంది ఉద్యోగులు పనిచేసే ఈ కంపెనీ వద్దకు ఈ ఘటనతో భారీ మొత్తంలో పోలీసులు చేరుకున్నారు. అతడు ఎందుకు ఈ కాల్పులు జరిపాడనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. కాల్పులలో మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది.
    
కాగా మరో ఘటనలోనూ తూటాల ధాటికి అయిదుగురు గాయపడ్డారు.  రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు లక్ష్యంగా ఈ కాల్పులు జరిగాయి. వర్జీనియాలోని అలెగ్జాండ్రియా బేస్‌ బాల్‌ మైదానంలో రిపబ్లికన్ పార్టీ సభ్యలు కొందరు బేస్‌ బాల్‌ సాధన చేస్తున్న సమయంలో ఓ సాయుధుడు తూటాల వర్షం కురిపించాడు.
    
గాయపడిన వారిలో పార్టీ అగ్ర నాయకుడు, లూసియానా ఎంపీ స్టీవ్‌ స్కేలీస్‌ తో పాటు మరో ఎంపీ రోజర్‌ విలియమ్స్‌ ఉన్నారు. గురువారం రిపబ్లికన్లు - డెమొక్రాట్ల మధ్య జరిగే మ్యాచ్‌ కోసం సాధన చేస్తుండగా 50 ఏళ్లకు పైగా ఉన్న ఓ సాయుధుడు మైదానంలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు మరణించాడు.  కాగా గాయపడిన రిపబ్లికన్ మెంబర్ స్కేలీస్‌ ఆ పార్టీలో టాప్ 3 నేతల్లో ఒకరు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • United Parcel Service worker 
  • San Francisco 
  • Gun Fire 
  • Telugu NEWs 

Similar News

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS