జగన్ అవినీతిని అదుపులో పెట్టగలిగాడు ..!

Update: 2019-11-20 09:08 GMT
చెట్టు మంచిదైతే ..ఆటొమ్యాటిక్ గా ఆ చెట్టు కాయలు కూడా మంచివే అవుతాయి. అలాగే పాలించే రాజు మంచివాడైతే ..ఆ రాజ్యంలోని ప్రజలు మంచి వారు అవుతారు - రాజ్యం కూడా మంచిది అవుతుంది. ఇలాగే ఉంది ప్రస్తుతం ఏపీ పరిస్థితి. ఒక్క అవకాశం ఇవ్వండి ..మళ్లీ మరోసారి రాజన్న రాజ్యాన్ని తీసుకోని వచ్చి చూపిస్తా అంటూ ఎన్నికల బరిలో దిగిన వైసీపీ అధినేత - ఏపీ సీఎం జగన్ .. ఎన్నికలలో అపూర్వమైన ప్రజామద్దతు తో అధికారంలోకి వచ్చి - ఇచ్చిన ప్రతి యొక్క మాటని తీర్చుతూ ఏపీని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారు.

ఇప్పటికే ఏపీ అభివృద్ధి లో భాగంగా ఎన్నో కార్యక్రమాలని ప్రవేశపెట్టారు. అలాగే పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి వంటి మంచి పథకాన్ని తీసుకువచ్చారు. అలాగే వచ్చే ఏడాది నుండి ప్రభుత్వ స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియం చెప్పేలా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఇక ముఖ్యంగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అవినీతి అనేదే లేకుండా ..ప్రభుత్వం పై ఎటువంటి మచ్చ పడకుండా ఎవరికైనా ఒకే రూల్ అంటూ ముందుకు సాగుతూ ..అవినీతి రహిత  ఆంధ్రప్రదేశ్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఎన్నికల సమయంలో కూడా జగన్ ఏపీని అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఆ వైపుగా సీఎం వడివడిగా అడుగులు వేస్తున్నారు.

ఇకపోతే తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇదే విషయం లో సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఏ విషయంపై అయినా కూడా నిర్మొహమాటంగా తన స్పందన తెలియజేసే ఉండవల్లి ..సీఎం జగన్ పై అవినీతి రహిత రాష్ట్రం ఏపీ అంటూ పొగడ్తలు కురిపించారు. ముఖ్యమంత్రి జగన్ అవినీతి ని బాగా అదుపులో వుంచారు అని - ప్రస్తుతానికి అది పై స్థాయిలో ఉన్నప్పటికీ - అతి త్వరలో క్రింది స్థాయిలో కూడా అవినీతి వుండదని చెప్పారు. అలాగే సీఎం జగన్ వలన ఎ.సి.బి. కూడా రాష్ట్రంలో  ఇప్పుడు బాగా పనిచేస్తుంది అని తెలిపాడు.


Tags:    

Similar News