వైసీపీ-ఉండవల్లి మధ్య ఏదో జరుగుతోంది.?

Update: 2019-01-25 16:54 GMT
రాష్ట్ర విభజన తర్వాత  కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌. అన్ని సమకాలీన అంశలాపై అద్భుతమైన అవగాహన ఉన్న వ్యక్తిగా ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కు పేరుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో.. ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. ఒక్క టీడీపీతో మినహా అన్ని పార్టీలతో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సత్సంబంధాలున్నాయి. వైసీపీతో అయితే ఇంకాస్త ఎక్కువై ఉన్నాయి. కొన్ని కీలక విషయాల్లో జగన్‌ కు సలహాలు - సూచనలు ఉండవల్లి ఇస్తుంటారు కానీ పార్టీలో మాత్రం చేరలేదు.
       
ఎన్నికల దగ్గర పడుతున్న వేళ.. ఈ నెలాఖరులో ఆల్‌ పార్టీ మీటింగ్‌ ఏర్పాటు చేశారు ఉండవల్లి.  విజియవాడలోని హోటల్ ఐలాపురంలో ఈ అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. దీనికి ఏపీలోని అన్ని పార్టీల ప్రతినిధుల్ని అహ్వానించారు. వామపక్షాల నుంచి రామకృష్ణ, మధు, బీజేపీ నుంచి కన్నా - కాంగ్రెస్‌ నుంచి రఘువీరారెడ్డి - జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌ హాజరవుతున్నారు. అయితే.. ఈ మీటింగ్‌ కు వైసీపీ నుంచి ఎవ్వరూ హాజరు కావడం లేదు. అసలు హాజరు అవ్వడానికి తమకు ఇష్టం లేదని జగన్‌ తేల్చి చెప్పేశారు. ఏపీకి హోదా విషయంలో ఏం పట్టించుకోని పార్టీలతో వచ్చి మీటింగ్‌ లో కూర్చుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. అందుకా తాము అఖిల పక్ష సమావేశాలని రావడం లేదని జగన్ చెప్పేశారు. దీంతో.. ఉండవల్లి - జగన్‌ మధ్య ఏదో జరిగిందని గుసగుసలు విన్పిస్తున్నాయి.
Tags:    

Similar News