వామ్మో ఐపీఎల్లా..బిత్తర పోతున్న అంపైర్లు!
కరోనా ఎప్పుడయితే ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి క్రికెట్ అటకెక్కింది. పరిస్థితి మారుతుందేమోనని చూసి చూసి ఇక కుదరదని నిర్ధారించి ఈ ఏడాది జరగాల్సిన టీ 20 వరల్డ్ కప్ ను వాయిదా వేశారు. ఇక ఐపీఎల్ నిర్వహణ కు మార్గం సుగమం అయ్యిందిలే అనుకుంటే రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా దేశంలో టోర్నమెంట్ నిర్వహణ సాధ్యం కాదని తేలిపోయింది. ఎలాగైనా సరే సీజన్ ను మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతో యూఏఈ వేదికగా టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించారు. ఈనెల 20వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉంది. అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎనిమిది జట్లు కూడా దుబాయ్ చేరుకున్నాయి. ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త కోసం క్వారంటైన్ లో ఉంచి కరోనా టెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై జట్టులో ఇద్దరు ఆటగాళ్లు సహా మొత్తం 12 మంది సిబ్బంది కరోనా బారిన పడడం ఆందోళన రేకెత్తిస్తోంది. అసలు టోర్నీ నిర్వహణ సాధ్యమయ్యే పనేనా అని సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆటగాళ్లను కాపాడుకోలేక అల్లాడుతున్న ఐపీఎల్ నిర్వాహకులకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. దుబాయ్ కి రాలేమని అంపైర్లు షాకిచ్చారు.
ఏటా నిర్వహించే ఐపీఎల్ కు ఐసీసీ ఎలైట్ అంపైర్లు విధులు నిర్వహిస్తూ వచ్చారు. కానీ ఈ దఫా కరోనా కారణంగా టోర్నమెంట్లో అంపైరింగ్ చేయడానికి అంపైర్లు విముఖత చూపిస్తున్నారు. ఇన్నాళ్లు ఆటగాళ్లను కాపాడుకుంటూ వస్తే చాలని భావించిన జట్ల యాజమాన్యాలకు నిజంగా ఇది పెద్ద దెబ్బే. ఎలైట్ అం పైర్లకు ఐసీసీ భారీగా ఫీజులు అందిస్తోందని, అయినా ఐపీఎల్ లో పాల్గొనేందుకు వారు ఆసక్తి చూపడం లేదని బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్లో క్రమం తప్పకుండా అంపైర్ నిర్వహించే ధర్మసేన వంటివారు కూడా ఈసారి ఐపీఎల్ వైపు చూడకపోవడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోందని బీసీసీఐ వెల్లడించింది.