వెనుజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడ్ని నేనే..ట్రంప్ సంచలనం
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. అగ్రరాజ్య అధిపత్యాన్నిమొరటుగా ప్రదర్శించేందుకు ఏ మాత్రం వెనుకాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించారు.;
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. అగ్రరాజ్య అధిపత్యాన్నిమొరటుగా ప్రదర్శించేందుకు ఏ మాత్రం వెనుకాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచ పోలీసుగా వ్యవహరించే అగ్రరాజ్య అధినేత హోదాలో తాజగా ఒక పోస్టు పెట్టారు. తన సొంత సోషల్ మీడియా ఖాతాలో ఆయన పెట్టిన పోస్టు ఇప్పుడు ప్రపంచానికి రానున్న సరికొత్త ముప్పుగా చెప్పాలి. ఇంతకూ ట్రంప్ చేసిన పనేమంటే.. తనను తాను వెనుజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించారు. సరికొత్త అంతర్జాతీయ ఆందోళనలకు.. ఉద్రిక్తతలకు తెర తీశారు.
డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో వెనెజువెలాపై సైనిక చర్యకు పాల్పడిన వైనం తెలిసిందే. జనవరి మూడో తేదీన ఆ దేశ రాజధాని కారకస సిటీపై మెరుపుదాడి చేసి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో.. ఆయన సతీమణిని బంధించి న్యూయార్క్ కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సుమారు 150 యుద్ధ విమానాలతో వెననెజువెలాపై భారీ ఆపరేషణ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 40 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ దాడులు ప్రపంచ వ్యాప్తంగా షాకింగ్ గా మారాయి. వెనుజువెలా ఎపిసోడ్ అనంతరం గ్రీన్ ల్యాండ్.. క్యూబా.. ఇరాన్.. ఇలా పలు దేశాలకు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇచ్చేస్తూ.. అంతర్జాతీయ కబ్జాదారు తీరులో వ్యవహరిస్తూ..తాను కోరుకున్న దేశం.. తాను కోరినట్లుగా నడుచుకోవాలన్న హుకుం జారీ చేస్తున్న వైనం ఇప్పుడు సరికొత్త ఆందోళనలకు తెర తీసేలా మారింది.
మదురో అక్రమ అరెస్టు తర్వాత వెనుజువెలా అధ్యక్ష స్థానంలో ఆ దేశ ఉపాధ్యక్షురాలిని తాత్కాలిక అధ్యక్షురాలిగా కూర్చోబెట్టింది ఆ దేశ సుప్రీంకోర్టు. తాజాగా మాత్రం వెనెజువెలాలో తమ ప్రభుత్వమే ఉంటుందని ట్రంప్ స్వయంగా ప్రకటించటం సంచలనంగా మారింది. వెనుజువెలాలో స్థిరమైన ప్రభుత్వం కొలువు తీరే వరకు తమ పర్యవేక్షణ ఉంటుందని ప్రకటించిన ఆయన తీరు షాకింగ్ గా మారింది. ఇలా బలమైన దేశాలు తమ కంటే బలహీనమైన దేశాల్ని టార్గెట్ చేస్తే పరిస్థితేంటి? అన్నదిప్పుడు చర్చ. మొత్తానికి తన తీరుతో ప్రపంచానికి ట్రంప్ సరికొత్త శాపంగా మారారని మాత్రం చెప్పక తప్పదు. ఇలా బలమైన దేశాలు తమకు తాముగా ఫలానా దేశానికి తాము తాత్కాలిక అధ్యక్షులమని చేసే ప్రకటనలకు చట్టబద్ధత ఉంటుందా? అన్నదిప్పుడు ప్రశ్న.