వైసీపీలో మంత్రి ప‌ద‌వుల రేసులో ఇద్ద‌రు కాపు ఎమ్మెల్సీలు...!

Update: 2022-02-23 23:30 GMT
వైసీపీలో సీనియ‌ర్ నాయ‌కుల‌కు ప్రాధాన్యం ద‌క్కుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌వైపు యువ‌త‌ను ప్రో త్సహిస్తూనే.. మ‌రోవైపు.. సీనియ‌ర్ల‌కు కూడా కీల‌క ప‌ద‌వులు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే త‌న మంత్రి వ‌ర్గంలో ప‌ది మందికి పైగా సీనియ‌ర్ల‌ను నియ‌మించుకున్నారు.

ఇప్పుడు మ‌రోసారి మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు జ‌ర‌గ‌నున్న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కూడా కీల‌క‌మైన సీనియ‌ర్ నాయ‌కుల‌కు అవ‌కాశం ఇస్తారా ? అనేది చ‌ర్చ‌గా మారుతోంది.

ఈ క్ర‌మంలో క‌డ‌ప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, సీనియ‌ర్ నేత సీ.రామ‌చంద్ర‌య్య ముందు వ‌రుస‌లో ఉ న్నారు. ఆయ‌న ఆదిలో కాంగ్రెస్ నాయ‌కుడిగా ఉన్నారు. త‌ర్వాత‌.. వైసీపీలో చేరి.. జ‌గ‌న్‌కు స‌న్నిహితు లుగా మారారు. కొన్నాళ్ల కింద‌ట ఎమ్మెల్సీ అయ్యారు. పార్టీలో మేధావిగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగానూ.. సేవ‌లు అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కూడా మంత్రి వ‌ర్గ రేసులో ముందున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

కానీ, క‌డ‌ప జిల్లాకు చెందిన జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. మ‌రో స్థానం ఇవ్వాల్సి ఉన్నా.. పార్టీలో అనేక మంది ఉన్నారు. వీరిని ప‌క్క‌న పెట్టి.. రామ‌చంద్ర‌య్య‌కు ఛాన్స్ ఇస్తారా ? అనేది చూడాలి. ఇక‌, మ‌రో వైపు.. గుంటూరు జిల్లాకు చెందిన మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు.. ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు కూడా క్యూలో ఉన్నారు.

ఈయ‌న జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహిత నేత‌గా పేరుంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్నిక‌ల ప్ర‌చార క‌మిటీ వ్యూహాల క‌మిటీకి బాధ్యులుగా కూడా వ్య‌వ‌హ‌రించారు.

ఆయ‌న‌కు ఇటీవ‌ల ఎమ్మెల్సీ రెండోసారి రెన్యువ‌ల్ అయ్యింది. కోస్తాలో కాపు నేత‌ల్లో ఆయ‌నే సీనియ‌ర్‌గా ఉన్నారు. ప్ర‌స్తుతం మండ‌లిలో వైసీపీ ప‌క్ష నాయకులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఈయ‌న‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని.. వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ఇలా ఎంతో మంది సీనియ‌ర్లు పోటీ ప‌డుతున్నారు. మ‌రి జ‌గ‌న్ ఎవ‌రిని క‌రుణిస్తారో చూడాలి.
Tags:    

Similar News