వీళ్లంతా.. బంగారు కుబేరులు

Update: 2015-07-02 05:30 GMT
22 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి లక్ష రూపాయిల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి కేరళలోని త్రిసూర్‌లో ఒక నగల దుకాణాన్ని మొదలు పెట్టారు. అలా మొదలైన ఆయన వ్యాపారం రోజురోజుకీ పెరుగుతూ వచ్చి..ఈ రోజున ఆయన పేరు.. ఆయన స్థాపించిన సంస్థ పేరు పలువురి నోట నానుతోంది. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. ప్రముఖ జ్యూయలరీ గొలుసుకట్టు సంస్థ అయిన కల్యాణ్‌ జువెలర్స్‌ అధినేత టీఎస్‌ కల్యాణరామన్‌.

తాజాగా ఆయన వార్తల్లోకి వచ్చారు. ఎందుకంటే.. భారత్‌లోని అత్యధిక సంపన్న బంగారు అభరణాల విక్రేతగా ఆయన పేరు నిలిచింది. సింగపూర్‌లోని వెల్త్‌ ఎక్స్‌ అనే సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ఆయన వ్యక్తిగత ఆస్తులు రికార్డు స్థాయిలో ఉండటం గమనార్హం. ఆయన ఆస్తుల మొత్తం 1.3బిలియర్‌ డాలర్లుగా తేల్చారు. అదే మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.8500కోట్లు.

ఆయన మాదిరే దేశంలో మరింతమంది బంగారు కుబేరులు ఉన్నట్లు సదరు నివేదిక పేర్కొంది. ఆ జాబితా ప్రకారం చూస్తే.. ఫైర్‌స్టార్‌ డైమండ్స్‌ నిరవ్‌ మోడీ రూ.7,150కోట్లు.. మలబార్‌ డోల్డ్‌ అండ్‌ డైమండ్‌ ఎంపీ అహ్మద్‌కు.. భీమా జువెలర్స్‌ బి. గోవిందన్‌కు రూ.4,050కోట్లు.. కిరణ్‌జెమ్స్‌ వల్లభ్‌భాయ్‌ ఎస్‌ పటేల్‌కు రూ.3,850కోట్ల ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. మనలో మన మాటగా చెప్పాలంటే.. అధికారికంగానే ఇంత మొత్తం అంటే..?

Tags:    

Similar News