ఎమ్మెల్యేలతో వన్ టూ వన్...పవన్ సీరియస్ స్టెప్స్

జనసేన అధినేత ఉప ముఖ్య్మంత్రి పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా పార్టీ మీద పూర్తి ఫోకస్ పెడుతున్నారు;

Update: 2025-12-19 16:30 GMT

జనసేన అధినేత ఉప ముఖ్య్మంత్రి పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా పార్టీ మీద పూర్తి ఫోకస్ పెడుతున్నారు ఆయన గ్రామ వార్డు బూత్ లెవెల్ నుంచి మండల, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి దాకా కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు అంతే కాదు, ఫైవ్ మెన్ కమిటీలను ఆయన ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం ద్వారా సమిష్టి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. అదే సమయంలో పార్టీలో ఉన్న నాయకులు, ప్రజా ప్రతినిధులు నామినేటెడ్ పదవులు అందుకున్న వారి పనితీరు గురించి కూడా మధింపు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన పార్టీకి సంబధించిన మొత్తం 21 మంది ఎమ్మెల్యేలతో తాను ఇద్దరు మంత్రులు కాకుండా మిగిలిన 18 మందితో వన్ టూ వన్ భేటీలు నిర్వహిస్తున్నారు ఇది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

డైరెక్ట్ గానే :

పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఈ భేటీలు నిర్వహిస్తున్నారు. రెండు విడతలుగా రెండు రోజుల పాటు ఈ భేటీలు సాగనున్నాయి. రోజుకు తొమ్మిది మంది వంతున ఎమ్మెల్యేలతో పవన్ వన్ టూ వన్ గా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం ఆయన తొమ్మిది మంది జనసేన ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ సమావేశం జరిపారు. ఈ వన్ టూ వన్ లో మొదట పాల్గొన్నది అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అయిఏ ఆ తరువాత వరసలో దేవ వర ప్రసాద్, లోకం నాగ మాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సీహెచ్ వంశీ క్రిష్ణ, నిమ్మక జయక్రిష్ణ, పంచకర్ల రమేష్ సుందరపు విజయ కుమార్ పాల్గొన్నారు

గ్రౌండ్ లెవెల్ లో ఎలా ఉంది :

ఇప్పటిదాక ప్రతీ ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ పథకాల అమలు వీటి మీద పవన్ వారిని అడిగి తెలుసుకున్నారు అదే విధంగా ప్రతీ నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యలు వాటి విషయంలో ప్రజలు చేసే ఫిర్యాదులు విన్నపాలు గురించి పవన్ అడిగి తెలుసుకున్నారు. తన ముందు ఉన్న వివరాలను వారితో పంచుకున్నట్లుగా తెలుస్తోంది పరిష్కార మార్గాలని ఏ విధంగా చూపించాలన్నది కూడా ఆయన డిస్కస్ చేసినట్లుగా తెలుస్తోంది.

పార్టీ పటిష్టత గురించి :

అంతే కాకుండా పార్టీ పటిష్టత మీద కూడా పవన్ వారితో చర్చించారు అని అంటున్నారు. పార్టీ ప్రస్తుతం ఎలా ఉంది, ఏ విధంగా మరింతగా బలోపేతం చేయాలి, పార్టీ క్యాడర్ తో ఎలా కో ఆర్డినేట్ చేసుకుంటున్నారు వంటివి కూడా ఆయన అడిగి తెలుసుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు జనాలకు ఎలా చేరువ అవుతున్నాయన్నది తెలుసుకున్నారని అంటున్నారు. వాటిని మరింతగా ప్రజలకు అందించే విషయంలో ఎమ్మెల్యేలు ముందుండి కీలక పాత్ర పోషించాలని పవన్ కోరారని అంటున్నారు. మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కూడా వన్ టూ వన్ భేటీ వేస్తారు అని అంటున్నారు.

మంచి పరిణామంగా :

ఎమ్మెల్యేలతో అధినేత వన్ టూ వన్ భేటీ కావడం మంచి పరిణామంగా చెబుతున్నారు. దీని వల్ల తమ మనసులో ఉన్న విషయాలను ఏ మాత్రం సంశయం లేకుండా ఎమ్మెల్యేలు కూడా అధినేతకు చెప్పుకోవడం పరిష్కారాలు వెతకడం, సూచనలు సలహాలు తీసుకోవడం వంటివి జరుగుతాయని అంటున్నారు. ఇక ఈ నెల 22న పవన్ జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అలాగే పార్టీ తరఫున నామినేటెడ్ పదవులు అందుకున్న వారు అంతా హాజరవుతారని వారికి పదవి బాధ్యత వంటి దాని మీద అధినేత పూర్తిగా వివరించి వారి నుంచి కూడా సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకుంటారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జనసేన పటిష్టం చేయడానికి పవన్ గట్టిగానే దృష్టి పెట్టారు అని అంటున్నారు.

Tags:    

Similar News