భారత పర్యటన పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2020-02-12 07:00 GMT
భారత జనాభా ఎంత..? 130 కోట్లకు పైగానే.. మరి ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుడు ఇండియాకు వస్తే ఎంత మంది స్వాగతించాలి.? అందులో కనీసం 1శాతం తీసుకున్నా కోటి మంది వరకూ ఆయనకు వెల్ కం చెప్పాలి.. కానీ మోడీ మాత్రం తనకు కేవలం లక్షల సంఖ్యలో ప్రజలు మాత్రమే స్వాగతం పలుకుతారని చెప్పాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24 - 25 తేదీల్లో భారత్ లో పర్యటిస్తున్నారు. న్యూఢిల్లీ - గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కొనసాగుతుందని అమెరికా అధ్యక్ష కేంద్ర కార్యాలయం వైట్ హౌస్ ప్రకటించింది.

భారత్ పర్యటన పై ట్రంప్ కూడా స్పందించారు. ప్రధాని మోడీ నాకు మంచి స్నేహితుడు అని.. ఆయన చాలా జెంటిల్ మెన్ అంటూ చెప్పుకొచ్చాడు. మోడీతో భారత పర్యటన గురించి చర్చించానని.. భారత్ కు వస్తే ట్రంప్ కు లక్షల మంది స్వాగతం పలుకుతారని తనతో చెప్పాడని ఉప్పొంగిపోయారు.

అయితే ఇటీవల అమెరికాలో తన ర్యాలీకి 50వేల మంది వచ్చారని.. మోడీ చెప్పిన లక్షల సంఖ్య తనకు సంతృప్తినివ్వడం లేదని ట్రంప్ చలోక్తులు విసిరారు. భారత జనాభాను బట్టి కనీసం 50-70లక్షల మంది ప్రజలు తనను స్వాగతించడానికి రావాలని సరదాగా వ్యాఖ్యానించారు.

ఇక భారత్ తో వాణిజ్య ఒప్పందం గురించి చర్చిస్తున్నామని.. సరైన ఒప్పందం కుదిరితే చేసుకుంటామని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News