• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రంప్ ట్వీట్ల‌...

ట్రంప్ ట్వీట్ల‌ ఎగ్జిబిష‌న్‌ కు పిచ్చి క్రేజ్‌

By - Tupaki Desk
Update: 2017-06-21 04:21 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోమారు వార్త‌ల్లో నిలిచారు. సోషల్‌ మీడియాను వాడటంలోనూ ఆయన తర్వాతే ఇంకెవరైనా అనే పేరు సంపాదించిన ట్రంప్ ట్వీట్ల‌కు తాజాగా ఊహించ‌ని గౌర‌వం ద‌క్కింది. ఆయ‌న ట్వీట్ల‌ను ఎగ్జిబిష‌న్‌ గా పెట్టారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా చేసిన కామెంట్లు ట్రంప్‌ కు కలిసొచ్చాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా ట్విట్టర్ వినియోగాన్ని మరింత పెంచారు. ఫెడరల్‌ సర్కారులో కీలక పదవుల్లో ఉన్నవారిని తొలగించే విషయాన్ని, కొత్త వారిని నియమించే సమాచారాన్ని కూడా ట్విట్టర్‌ ద్వారానే ప్రకటించారు.  

కోపమొచ్చినా - సంతోషమొచ్చినా ట్వీట్లు కొట్టి ``కింగ్‌ ఆఫ్‌ ట్వీట్స్‌`` గా ట్రంప్‌ బిరుదు సంపాదించుకున్నారు. అలా ట్రంప్ ట్వీట్లు ఇప్పుడు మ్యూజియంలో చోటు సంపాదించుకున్నారు. ట్రంప్‌ ట్వీట్లన్నింటినీ ఒక చోట చూసే అవకాశం న్యూయార్క్‌ వాసులకు దక్కింది. న్యూయార్క్‌ లో టెలివిజన్‌ కామెడియన్‌ ట్రెవర్‌ నోవాద `డొనాల్డ్‌ జె ట్రంప్‌ ప్రెసిడెన్షియల్‌ ట్విట్టర్‌ లైబ్రరీ`` పేరుతో ప్రదర్శన ప్రారంభించారు. ఈయన గతంలో ట్రంప్‌ తో కలిసి టి.వి కామెడీ షో లో పనిచేశారు. న్యూయార్క్ లోని ట్రంప్‌ టవర్స్‌ పక్కనే ఈ ప్రదర్శన ఏర్పాటు చేయటం విశేషం.

ఈ ఎగ్జిబిషన్‌ భవనంలోకి అడుగుపెట్టగానే ముందుగా గాజు తలుపులు, మెటల్‌ డిటెక్టర్లున్న సెక్యూరిటీ గార్డులు. తర్వాత ఓ గాజు కేసింగ్‌లో రెండు చేతులు పట్టుకున్న ఐఫోన్‌ దర్శనమిస్తుంది. ఈ చేతుల వెనుక ఉన్న భారీ తెరపై ట్రంప్‌ ట్వీట్ల ప్రదర్శన గురించి ట్రెవర్‌ వీడియో ప్రదర్శన ఉంటుంది. ఎగ్జిబిషన్‌ గోడలపై గతంలో ట్రంప్‌ చేసిన ముఖ్య ట్వీట్లను ఫ్రేముల్లో డిజైన్‌ చేసి పెట్టారు. అమెరికా బడా నేతలపై ఎన్నిసార్లు ట్రంప్ విరుచుకుపడ్డారో ఈ ఎగ్జిబిషన్‌ లో వివరంగా రాసి పెట్టారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాపై 2 వేల 723, హిల్లరీ క్లింటన్‌పై 884 సార్లు ట్రంప్ ట్వీట్‌ చేశారు.  ఇక ఈ ప్రదర్శనకు జనం భారీ ఎత్తున హాజరవుతుండటం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Donald Trump 
  • Twitter Museum 
  • Telugu NEWs 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS