ట్రంప్ మళ్లీ మొదలెట్టాడు..

Update: 2021-02-14 16:30 GMT
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాక్టివ్ అయ్యారు. అమెరికన్లకు కొత్త పిలుపునిచ్చారు.  తాజాగా ట్రంప్ పై పెట్టిన అభిశంసన వీగిపోవడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు. కేపిటల్ భవనంపై దాడి ఘటనకు సంబంధించి రెండో అభిశంసన విచారణలో భాగంగా సెనేట్ లో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో ట్రంప్ ను నిర్ధోషిగా ప్రకటించారు.

తనను నిర్ధోషిగా ప్రకటించిన సెనెట్ సభ్యులకు, మద్దతుదారులకు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి అసలు ఉద్యమం ఇప్పుడే ప్రారంభమైందని ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే మరో అధ్యయమని ట్రంప్ పేర్కొన్నారు.

త్వరలో అమెరికన్ భవిష్యత్తు కోసం మంచి కార్యక్రమం ద్వారా మళ్లీ కలుద్దామని ట్రంప్ పిలుపునిచ్చారు. సత్యాన్ని, న్యాయాన్ని సమర్థిస్తూ తన కోసం పనిచేసిన మద్దతుదారులకు ట్రంప్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

అమెరికాలో అధ్యక్షుల చరిత్రలోనే రెండుసార్లు అభిశంసనను ఎదుర్కొన్న వ్యక్తిగా ట్రంప్‌ మిగిలిపోయారు. అమెరికాను గొప్పగా మార్చడానికి చారిత్రాత్మక, దేశభక్తితో పాటు అసలైన రాజకీయం ఉద్యమం ఇప్పుడే ప్రారంభమైందని ట్రంప్ చెప్పుకొచ్చారు. మళ్లీ తిరిగి వస్తానని అన్నారు. రాబోయే నెలల్లో మీతో తాను చాలా పంచుకోవలసి ఉందన్నారు. ప్రజలందరికీ అమెరికన్ గొప్పతనాన్ని సాధించడానికి అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ట్రంప్ పిలుపునిచ్చారు. 
Tags:    

Similar News