టీఆర్ఎస్ ఎమ్మెల్యే బెదిరింపులు.. హైకోర్టులో పిల్
పటాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. జర్నలిస్ట్ సంతోష్ నాయక్ ను బెదిరించిన కేసులో మహిపాల్ రెడ్డి అరెస్ట్ కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటీషన్ వేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ శుక్రవారం ఆ పిటీషన్ విచారణకు రానుంది.
ఎమ్మెల్యే మహిపాల్ సదురు జర్నలిస్ట్ సంతోష్ ను ఫోన్ లో దూషించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అమీన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి.
కేసులు నమోదు కావడంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెనక్కి తగ్గారు. రిపోర్టర్ సంతోష్ నాయక్ పై ప్రతాపం చూపించారు. తాను రిపోర్టర్ పై చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు.తనకు జర్నలిస్టులంటే గౌరవం ఉందని పేర్కొన్నారు.కబ్జాలతో తనకు సంబంధం లేదన్నారు.
కబ్జాలపై తన పేరును పత్రికల్లో రిపోర్టర్ సంతోష్ నాయక్ రాయడంతోనే తాను మాట్లాడానని.. వివరణ తీసుకొని ఉంటే బాగుండేది అని చెప్పానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. అయినా కేసులు, పిటీషన్లు దాఖలు చేశారన్నారు. శుక్రవారం కోర్టులో విచారణ ఎదుర్కొంటానని వివరించారు.