మన పవర్‌ను ఎవరూ తీసేయలేరు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను దారుణంగా ధ్వంసం చేశారని ఆయన చెప్పారు.;
``మన పవర్‌ను ఎవరూ తీసేయలేరు.`` అంటూ.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యా ఖ్యలు చేశారు. అందరూ కలసి కట్టుగా ఉంటే..అందరూ సమన్వయంతో ఉంటే.. ఎవరూ పవర్‌ను తీసే యలేరన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కొత్త కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా కమిటీల్లో బాధ్యతలు చేపట్టనున్న యువ నేతలను, సీనియర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
పార్టీ కమిటీల్లో కొత్త తరానికి, ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా అవకాశం కల్పించామని చెప్పారు. పార్టీ పదవులు దక్కించుకున్న నాయకులు.. పార్టీ సిద్ధాంతాలను మరింత ఎక్కువగా అధ్యయనం చేయాలని సూచించారు. అందరితోనూ కలివిడిగా ముందుకు సాగాలని.. ప్రజలకు ఎక్కువగా చేరువ కావాలని ఆయ న సూచించారు. సీనియర్లను గౌరవిస్తూనే.. కొత్త వారికి.. యువతకు అవకాశం కల్పించామని చంద్రబాబు తెలిపారు. అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.
వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను దారుణంగా ధ్వంసం చేశారని ఆయన చెప్పారు. ఒక్కొక్క వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎంతో కష్టప డాల్సి వస్తోందన్నారు. అధికారంలో ఉన్న పార్టీగా.. ఇటు ప్రజలను.. అటు పార్టీ నాయకులను కూడా సంతృప్తిపరచాల్సి వస్తుందని.. ఈక్రమంలో పార్టీకి గతంలో అనుకున్నంతగా పనిచేయలేక పోయామని అన్నారు. కానీ.. ఇప్పుడు ఆ గ్యాప్‌ను తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు.
ప్రభుత్వం పరంగా గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని చంద్రబాబు చెప్పారు. సూపర్ సిక్స్‌ను సూపర్ సక్సెస్ చేశామన్నారు. మరోవైపు..పార్టీ పరంగా కీలక కమిటీలను నియమించామని .. ఆశావహులతోపాటు.. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్నవారిని గుర్తించి అనేక వడపోతల తర్వాత పదవులు పంపిణీ చేశామన్నారు. గతంలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన పార్టీ.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా.. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటోందని చంద్రబాబు విమర్శించారు. అన్ని పరిణామాలను ఎదుర్కొంటూనే వచ్చే ఎన్నికల నాటికి కూటమి విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.