రాష్ట్రపతి వెళ్లాల్సిన చోటకు మోడీ.. యువతకు మెసేజ్!
ఈ వ్యవహారం .. కేంద్రాన్ని ఇంకా వేధిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన అవకాశాన్ని ప్రధాని సద్వినియోగం చేసుకున్నారు. "సమస్యలు వస్తాయి.
ఐఐటీ-ఢిల్లీ స్నాతకోత్సవం.. శనివారం జరిగింది. అయితే.. ఏ విశ్వవిద్యాలయానికైనా.. గవర్నర్ చాన్సలర్ గా ఉంటారు. ఐఐటీలకు రాష్ట్రపతి చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తారు. సో.. ఐఐటీలకు సంబంధించి జరిగే స్నాతకోత్సవాలకు.. రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి వెళ్తారు. అయితే.. దీనికి భిన్నంగా తొలిసారి ఐఐటీ ఢిల్లీ సంస్థ నిర్వహించిన స్నాతకోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ అతిథిగా హాజరయ్యారు. ఆయన ఈ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకునేది ఇప్పుడు చర్చగా మారింది.
ఇక, ఈ స్నాతకోత్సవంలో ప్రధాన మంత్రి.. యువతను ఉద్దేశించి కీలక సందేశం ఇచ్చారు. అదే.. "ప్ర శ్నించవద్దు" అని!. ఆయన ఏ యాంగిల్‌లో ఈ వ్యాఖ్యలు చేశారన్నది ప్రస్తుతం పక్కన పెడితే.. దేశవ్యా ప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ చేసిన నిరసనలు, ఆందోళనలు.. కేంద్రాన్ని ప్రశ్నించినవే. నీట్ పరీక్ష పేపర్ లీకైన నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌తో రాజీనామా చేయించే వరకు కూడా వారు నిద్రపోలేదు. మొత్తంగా ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.
ఈ వ్యవహారం .. కేంద్రాన్ని ఇంకా వేధిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన అవకాశాన్ని ప్రధాని సద్వినియోగం చేసుకున్నారు. "సమస్యలు వస్తాయి. అనేక సమస్యలు ఇంకా ముందు ముందు ఉన్నాయి. వాటిని ప్రశ్నించడం కాదు. పరిష్కారాలు ఆలోచించాలి." అని యువతను ఉద్దేశించి ఆయన వ్యా ఖ్యానించారు. అయితే.. ఎక్కడా జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలను కానీ, కాక్రోచ్ జనతా పార్టీ గురించి కానీ, ఆయన ప్రస్తావించలేదు. కానీ, ఆయన మాటల్లో అంతరార్థం మాత్రం అదేనంటున్నారు పరిశీలకులు.
ముఖ్యంగా 25-30 ఏళ్ల యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రధాని చూసించారు. ఇటీవల నిరసనలు చేసింది.. ఈ వయసు వారే కావడం గమనార్హం. అలానే రాబోయే భవిష్యత్తులో మీ పాత్ర ఎంతో ఉందని ప్రధాని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి సమస్యను ప్రశ్నిస్తూ కూర్చుంటే పరిష్కారం దొరకదని ఆయన పేర్కొన్నారు. తద్వారా.. ప్రధాని యువతను ప్రశ్నించడం కాదు.. అనే సందేశాన్ని పరోక్షంగా అందించినట్టు అయిందని అంటున్నారు విశ్లేషకులు. మరి మోడీ తన మనసులోని మాటనే చెప్పారో.. లేక ఆయన అంతరంగం ఏంటనేది చూడాలి.