రెడ్ బుక్ వ‌ర్సెస్ డిజిట‌ల్ బుక్‌.. గెయినెంత‌.. ?

రాష్ట్ర‌ రాజకీయాల్లో తాజాగా రెడ్ బుక్ వ‌ర్సెస్ డిజిట‌ల్ బుక్‌ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది.

Update: 2026-09-25 19:30 GMT

రాష్ట్ర‌ రాజకీయాల్లో తాజాగా రెడ్ బుక్ వ‌ర్సెస్ డిజిట‌ల్ బుక్‌ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. తాజాగా మ‌రోసారి వైసీపీ అధినేత జ‌గ‌న్ డిజిట‌ల్ బుక్ గురించి కామెంట్లు చేసిన విష‌యం తెలిసిందే. దీనికితోడు.. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌కు ఒక రోజు ముందు అనంత‌పురంలో ప‌ర్య‌టించిన మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ ఇంకా మూసేయ‌లేద‌ని చేసిన వ్యాఖ్య‌లు కూడా రాజ‌కీయంగా మ‌రింత ఆస‌క్తిని రేపింది. నిజానికి నారా లోకేష్ 'రెడ్ బుక్'కు కౌంటర్‌గా వైఎస్ జగన్ 'డిజిటల్ బుక్'ను తీసుకువచ్చారు.

రెడ్ బుక్ విష‌యానికి వ‌స్తే.. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులు, ఇత‌ర అధికారుల పేర్లు ఇందులో నోట్ చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. అయితే.. దీనిలో రాజ‌కీయ నేత‌ల పేర్లు ఉన్నాయ‌న్న‌ది వైసీపీ నేత‌లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం వివిధ కేసుల్లో జ‌రుగుతున్న అరెస్టుల‌ను దీనికి ముడి పెడుతున్నారు. దీంతో త‌ర‌చుగా రెడ్ బుక్ వ్య‌వ‌హారంపై టీడీపీని కార్న‌ర్ చేస్తూ.. వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇక‌, వైసీపీ కూడా.. డిజిట‌ల్ బుక్ పేరుతో ఒక విభాగం ఏర్పాటు చేసింది. పార్టీ కేడ‌ర్‌ను వేధించే పోలీసులు.. ఇత‌ర అధికారులు, నాయ‌కుల పేర్లు.. విష‌యం ఏదైనా కూడా దీనిలో న‌మోదు చేయాల‌ని కోరారు. ప్ర‌స్తుతం డిజిట‌ల్ బుక్‌పై వైసీపీ నేత‌లు ఆశ‌లు పెట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే.. త‌ర‌చుగా జ‌గ‌న్ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నా రు. దీంతో రెడ్ బుక్ వ‌ర్సెస్ డిజిట‌ల్ బుక్‌పై చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చకు దారితీసింది.

ఏంటి రిజ‌ల్ట్‌.. ?

గ‌తంలో టీడీపీ కేడర్‌లో జోష్ నింపడం, ప్రత్యర్థులకు/అధికారులకు హెచ్చరికలు పంపడం కోసం లోకేస్ రెడ్ బుక్ పేరును వాడుకున్నారు. తాజాగా జిటల్ బుక్ కూడా అదే ల‌క్ష్యంతో ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులు, అన్యాయాలను రికార్డ్ చేయడానికి ఒక డిజిటల్ బుక్, క్యూఆర్ కోడ్‌ను జగన్ వినియోగిస్తున్నారు. బాధితులకు పార్టీపరంగా అండగా ఉండటానికి, న్యాయ పోరాటం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ప్ర‌యోజ‌నం ఎంత‌..?

కష్టకాలంలో శ్రేణులకు ధైర్యం చెప్పడం, ప్రభుత్వ తప్పులను డిజిటల్ రూపంలో రికార్డ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది ఇరు పార్టీల‌కు ఎన్నిక‌ల‌కు ముందు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌న్న చ‌ర్చ ఉంది. రాజకీయంగా రెండు పార్టీలు కూడా తమ కేడర్‌ను కాపాడుకోవడానికి, మోటివేట్ చేయడానికి ఈ వ్యూహాలను వాడుతున్నాయి. ప్రజా క్షేత్రంలో: రెడ్ బుక్ ద్వారా కక్షసాధింపు చర్యలనే చర్చ నడిస్తే, డిజిటల్ బుక్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు, దాడుల బాధితుల వివరాలను హైలైట్ చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. దీనివల్ల ఎవరికి ఎంత మైలేజ్ వస్తుందనేది భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.

Tags:    

Similar News