దేశంలో ఉప ఎన్నిక‌ల వేడి... ఎందుకిలా?

దేశంలో ఉప ఎన్నిక‌ల వేడి రాజుకుంది. స‌హ‌జంగానే ప్ర‌తి సంవ‌త్స‌రం ఎక్క‌డో ఒక చోట ఉప ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉంటాయి.

Update: 2026-09-25 16:30 GMT

దేశంలో ఉప ఎన్నిక‌ల వేడి రాజుకుంది. స‌హ‌జంగానే ప్ర‌తి సంవ‌త్స‌రం ఎక్క‌డో ఒక చోట ఉప ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉంటాయి. ఇది కామ‌నే. అభ్య‌ర్థులు పార్టీ మార‌డ‌మో.. అనారోగ్యంతో మృతి చెంద‌డ‌మో.. లేక వివిధ కారణాల తో నియోజ‌క‌వ‌ర్గాలు ఖాళీ కావ‌డ‌మో జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారుతోంది. ఈ విధంగా ప్ర‌స్తుతం ప‌లు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ జారీ చేసింది. దీని ప్ర‌కారం.. ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల‌కు సంబంధించిన ఉప ఎన్నిక‌ల‌కు ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డింది. ఇప్ప‌టికే నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా పూర్త‌యింది. వాటికి.. వ‌చ్చే నెల 6వ తేదీన ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే పలు ప్ర‌ధాన పార్టీలు ప్ర‌చారాన్ని కూడా ప్రారంభించాయి. అయితే.. సాధార‌ణంగా ఉప ఎన్నిక‌ల‌ను ఒక‌ప్పుడు ప్ర‌ధాన పార్టీలు లైట్ తీసుకునేవి. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది.

గెలుపు ఓటముల మాట ఎలా ఉన్నా.. అధికార పార్టీలు త‌మ‌స‌త్తా చాటుకునేందుకు.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు.. త‌మ ఉనికిని చాటుకునేందుకు ఈ ఉప ఎన్నిక‌ల‌ను కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. దీంతో ప‌లు రాష్ట్రాల్లో అధికార పార్టీలు.. ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కుల‌ను నియంత్రిస్తుండ‌గా.. మ‌రికొన్ని చోట్ల‌.. ప్ర‌జ‌లకు ప్ర‌త్యేక తాయిలాలు ప్ర‌క‌టిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఒక‌ప్పుడు ఉప ఎన్నిక‌లో అధికార పార్టీలు గెలుపు గుర్రం ఎక్కేవి. కానీ, మారుతున్న ప‌రిస్థితుల్లో ప్ర‌త్య‌ర్థులు కూడా పైచేయిసాధిస్తున్నారు. దీంతో ఉప ఎన్నిక‌లు కూడా తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ దుమారానికి కేంద్రంగా మారుతున్నాయి.

ఇవీ.. ఉప ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాలు..

లోక్‌సభ నియోజకవర్గం:అస్సాం: నాగావ్, ఇక‌, అసెంబ్లీ నియోజకవర్గాల విష‌యానికి వ‌స్తే.. పశ్చిమ బెంగాల్ లో రెండు స్థానాల‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. 1) నందిగ్రామ్, 2) రేజీనగర్. తమిళనాడులో కూడా 2 స్థానాల‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. 1) ధరపురం, 2) మదురాంతకం. పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం)లో:తట్టంచవాడి నియోజ‌క‌వ‌ర్గానికి ఉప పోరు జ‌రుగుతుంది. అక్టోబర్ 6న పోలింగ్ జ‌రుగుతుండ‌గా.. అదే నెల 9న ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాజ‌కీయాలు హీటెక్కాయి.

Tags:    

Similar News