నిన్నటి పొలిటిక్ హీరోలు... నేడు వీళ్ల ఫ్యూచ‌ర్ ఏంటి...?

సునీత వాస్తవానికి చీరాల నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో తీవ్ర వివాదం కూడా అయింది.;

Update: 2026-04-29 08:30 GMT

పార్టీలు మారారు. అధికార పార్టీ టీడీపీలోకి ఒక‌రు, మిత్ర‌ప‌క్షం బీజేపీలోకి మ‌రొక‌రు వచ్చారు. తమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆధిలోని హంసపాదు అన్నట్టుగా వారు అనుభవిస్తున్న పదవులకు రాజీనామాలు చేసినప్పటికీ ఆ రాజీనామాలు ఇప్పటికీ ఆమోదం పొందలేదు. వారే వైసిపి తరఫున ఎమ్మెల్సీలుగా మండలి లోకి ప్రవేశం పొందిన పోతుల సునీత, మర్రి రాజశేఖర్. వీరిద్దరి పరిస్థితి ఇప్పుడు డోలాయ‌మానంగా మారింది.

వీరిలో మర్రి రాజశేఖర్ టిడిపి తరఫున వ్యవహరిస్తుండగా, పోతుల సునీత బిజెపి పక్షాన ఉన్నారు. వాస్తవానికి టిడిపిలోనే చేరాలని పోతుల సునీత భావించినప్పటికీ చివరి నిమిషంలో జరిగిన మార్పుల కారణంగా ఆమె కాషాయకండువా కప్పుకున్నారు. కానీ అ ప్రకటితంగా ఆమె టిడిపి తరఫున పనిచేస్తున్నారనేది రాజకీయంగా జరుగుతున్న చర్చ. ఇదిలా ఉంటే మరి వచ్చే ఎన్నికల నాటికి వీరి పరిస్థితి ఏమిటి అనేది ఆసక్తిగా మారింది,

సునీత వాస్తవానికి చీరాల నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో తీవ్ర వివాదం కూడా అయింది. ఇక మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట నుంచి వరుస పరాజయాలు పొందారు. ఈ క్రమంలో ఆయన వచ్చే ఎన్నికల నాటికి ఏ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటికే సీనియర్ నాయకుడు పత్తిపాటి పుల్లారావు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా వారసత్వ రాజకీయాల వైపు చూస్తున్నారు.

ఈ క్రమంలో నియోజకవర్గాన్ని వదులుకునేందుకు ఆయన సిద్ధంగా లేరు. ఇక పోతుల సునీతకు చీరాలలో అవకాశం లేదు. దీంతో వీరిద్దరి పరిస్థితి ఎటువైపు మలుపు తిరుగుతుంది అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే ఫ్యూచర్ మాత్రం గందరగోళంగానే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి వాటిని ఆమోదం పొందితే మరింత ఇబ్బందికర పరిస్తితినే ఎదుర్కోవాల్సిన స్థితి వస్తుందన్నది వారి అనుచరుల్లో కనిపిస్తోంది.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ కు ఆ వర్గం మద్దతు ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఆశించిన విధంగా పరిస్థితి లేదు. సో ఆయన వచ్చే ఎన్నికల్లో మరి పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి రావచ్చు అనేది ఒక అంచనా. ఇక పోతుల సునీత పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మరి వీరిద్దరూ ఎటువంటి అడుగులు వేస్తారు అనేది చూడాలి.

Tags:    

Similar News