రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం
| గాయపడిన వ్యక్తిని తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఆస్పత్రిలోకి ఈడ్చుకెళ్లడం వల్ల అతడి గాయాలు మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉందని.. వీటిపై విచారణ జరపాలని పిటీషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
అనంతపురం జిల్లా రాప్తాడులో నిందితుడు ఓ బాలికపై చేసిన దారుణ దాడికి యావత్ భారత్ కలకలం చెందింది. ప్రస్తుతం బాలిక బెంగళూరులో చికిత్స పొందుతోంది. ఇక రాప్తాడు నిందితుడిని అడవుల్లో పోలీసులు కాల్పులు జరపడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి కాలును తీసేయాల్సి వచ్చింది. అయితే అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.
పోలీసులు నిందితుడిపై జరిపిన కాల్పులపై ఏపీ హైకోర్టులో ఓ న్యాయవాది పిటీషన్ దాఖలు చేయడంతో సంచలనమైంది. అతడిని ఆస్పత్రిలోకి ఈడ్చుకెళ్లిన వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. నిందితుడిపై ఆరు రౌండ్ల కాల్పులు జరపాల్సిన అవసరం ఏంటి? కాల్పుల సమయంలో నెలకొన్న పరిస్థితులు ఏమిటో తెలియజేయాలని పిటీషన్ లో పేర్కొన్నారు. నిందితుడి కాళ్లకు బుల్లెట్ గాయాలతోపాటు ముఖంపై కూడా గాయాలు కావడంపై ఆరాతీసింది. అవి ఎలా ఏర్పడ్డాయి? వాటికి కాల్పులతో సంబంధం ఉందా? అటవీ ప్రాంతంలో పడిపోవడం వల్లే గాయాలయ్యాయన్న పోలీసుల వివరణలో వాస్తవమెంత అనే అంశాలను వైద్య, ఫోరెన్సిక్ ఆధారాలతో నిర్ధారించాలని కోరారు.
గాయపడిన వ్యక్తిని తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఆస్పత్రిలోకి ఈడ్చుకెళ్లడం వల్ల అతడి గాయాలు మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉందని.. వీటిపై విచారణ జరపాలని పిటీషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డువచ్చిన మరో విద్యార్థినిపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.. తీవ్రంగా గాయపడిన బాలిక ప్రస్తుతం బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ వ్యవహారం హైకోర్టు కు ఎక్కడం.. నిందితుడి కాల్పులపై న్యాయవాది పలు ప్రశ్నలు లేవనెత్తడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.