• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ్రేకింగ్: టీపీసీసీ చీఫ్...

బ్రేకింగ్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామా

By - Tupaki Desk
Update: 2020-12-04 14:10 GMT
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు ఫలితాలలో అధికార టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా తలపడిన సంగతి తెలిసిందే. ఎంఐఎం ఎప్పటిలాగే తన స్థానాలను పదిలం చేసుకోగా...కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. టీఆర్ఎస్ దాదాపుగా 60 డివిజన్లలో గెలిచే అవకాశముండగా...బీజేపీ 45 డివిజన్లు గెలుచుకునే చాన్స్ ఉంది. ఎంఐఎం 40 డివిజన్లలో గెలిచే అవకాశాలుండగా...కాంగ్రెస్ పార్టీ 2 డివిజన్లతో సరిపెట్టుకుంది. పూర్తి ఫలితాలు వెలుడాల్సి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం ఖరారైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో గ్రేటర్ ఎన్నికల ఫలితాలు పెను ప్రకంపనలు రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ.... 2019 ఎన్నికల్లో పరాజయం...ఇటీవల దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి....తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం పాలవడంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఉత్తమ్ వెల్లడించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. కనీసం పది స్థానాలైనా దక్కించుకుందని ఆశపడ్డ కాంగ్రెస్ నేతలకు భంగపాటు ఎదురైంది. కేవలం రెండు స్థానాలకే కాంగ్రెస్ పరిమితం కావడంతో మరోసారి కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకమైంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా కాంగ్రెస్ కు వరుస ఓటములు ఎదురుకావడం...కాంగ్రెస్ నుంచి కొందరు కీలకమైన నేతలు బీజేపీలో చేరడం వంటి పరిణామాలతో పాటు తాజాగా కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో ఉత్తమ్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను ఉత్తమ్ హైకమాండ్ కు పంపినట్టు తెలుస్తోంది. అయితే, ఉత్తమ్ రాజీనామాను హైకమాండ్ ఆమోదిస్తుందా...ఒకవేళ ఆమోదిస్తే కొత్త టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    
  • TPCC chief 
  • Uttam Kumar 
  • Resign 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS