మేకిన్ ఇండియాలో ఆటబొమ్మలకు యమ గిరాకీ
భారత్-చైనా సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణంతో దేశంలో స్వదేశీ ఉద్యమం మొదలైంది. ముఖ్యంగా చైనా వస్తువులు బహిష్కరించాలని ఓ ఉద్యమమే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా విదేశీ వస్తువులపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడింది. ఈ క్రమంలోనే అనేక రాష్ట్రాల్లో చైనా వస్తువులపై బహిష్కరణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో చైనీస్ వస్తువుల తయారీకి చెక్ పెడుతూ.. మేడ్ ఇన్ ఇండియా వస్తువులకు భారీగా డిమాండ్ పెరిగింది. వాటిలో అన్ని వస్తువులు ఉన్నాయి. తాజాగా స్వదేశీ ఆటబొమ్మలకు క్రేజీ ఏర్పడింది.
చైనీస్ కంపెనీలకు ధీటుగా.. ఉత్పత్తిని ఆటబొమ్మల కంపెనీలు పెంచుతున్నాయి. దీంతో చైనా నుంచి ఆటబొమ్మల దిగుమతి చేసుకోకుండా.. మన దేశంలో తయారైన వస్తువులనే అమ్ముడయ్యేలా.. కొనేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి తయారీదారులు సహకరిస్తున్నారు. తక్కువ ధరకే మంచి నాణ్యత గల వస్తువులు తయారు చేసేందుకు తయారీదారులు సిద్ధమయ్యారు. ఈ ఆటబొమ్మలకు పేరుగాంచిన గుజరాత్‌లో ప్రస్తుతం ఆ తయారీ కంపెనీలు కళకళలాడుతున్నాయి. మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తమ ఆటబొమ్మలకు గిరాకీ పెరిగిందని.. డిమాండ్ భారీగా పెరిగిందని తయారీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాము 200 రకాల ఆటబొమ్మలను తయారు చేసేందుకు రెడీ అయ్యామని.. ప్రస్తుతం 50 రకాల ఆట వస్తువులను తయారు చేస్తున్నట్లు ఆనందంగా చెబుతున్నారు.