• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ‘చింత’ చచ్చినా... పులుపు...

‘చింత’ చచ్చినా... పులుపు చావట్లేదే!

By - Tupaki Desk
Update: 2019-09-11 01:30 GMT
చింతా మోహన్... ఇప్పటి తరానికి పెద్దగా తెలియని నేతే గానీ... కాస్తంత వెనక్కు వెళితే... కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతే. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం, తిరుమల వెంకన్న పాదాల చెంత ఉన్న తిరుపతి కేంద్రంగా రాజకీయాలు నడిపిన చింతా... తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఏకంగా ఆరు పర్యాయాలు లోక్ సభకు ఎన్నికైన నేతగా ఘన చరిత్ర కలిగిన నేతే. అయితే కాలం మారింది కదా. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి లాగే చింతా మోహన్ పరిస్థితి కూడా ఇప్పుడు ఎందుకూ కొరగాకుండా పోయింది. అయితేనేం... కాంగ్రెస్ పార్టీ నేతగా - మాజీ ఎంపీ హోదాలో ఇటీవల పదే పదే మీడియా ముందుకు వస్తున్న చింతా... తనదైన శైలి వ్యాఖ్యలు చేస్తూ లైమ్ లైట్ లోనే ఉండేందుకు యత్నిస్తున్నారు.

తాను నిత్యం జనం నోళ్లలో నానేందుకు యత్నించడంలో తప్పు లేదు గానీ... ఇప్పటి ఆధునిక యుగంలో ఇంకా మూఢ నమ్మకాలను నమ్మే వ్యక్తిగా - అవే భావనలను జనంలో నూరిపోసేలా మాట్లాడటం ద్వారా జనం  నోళ్లలో నానేందుకు యత్నించడం మాత్రం కరెక్ట్ కాదన్న మాట అయితే వినిపిప్తోంది. అయినా ఇప్పుడు చింతా మోహన్ ఏం చేశారని ఆయనపై అంత అభాండాలు వేస్తున్నారంటారా? అయితే నవ్యాంధ్ర నూతన రాజదాని అమరావతిని రాజకీయ నేతల జయాపజయాలపై ఆయన చేసిన కామెంట్లను మనం వినాల్సిందే.

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారంటూ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలోకి తాను కూడా దిగేసిన చింతా... మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దిశగా ఆయన ఏమన్నారంటే... రాజధాని అమరావతిలోని తుళ్లూరు శాపగ్రస్త ప్రాంతమని ఆయన అన్నారు. అది దళితుల రక్తంతో తడిసిన ప్రాంతమని కూడా చింతా తేల్చేశారు. చంద్రబాబు ఓటమికి రాజధాని అమరావతే కారణమని - రాజధానిగా అమరావతి ఉన్నంతవరకు జగన్ కూడా సక్సెస్ కాలేరని చింతా అభిప్రాయపడ్డారు. తుళ్లూరు ప్రాంతంలో రాజధాని నిర్మించే ప్రయత్నం చేయడం వల్లే చంద్రబాబు జారిపడ్డారని, అదే సమయంలో జగన్ కు కూడా పెద్దగా కలిసిరాకపోవచ్చని ఆయన ఓ బాంబు పేల్చారు. ఏపీ రాజధానిగా తిరుపతి అన్ని విధాలా సరైన ప్రాంతం అని స్పష్టం చేశారు. మరి ఈ మాటలు వింటుంటే చింత చచ్చినా పులుపు చావలేదని చెప్పక తప్పదు కదా.
    

Tags:    
  • Tirupathi Ex MP Chinta Mohan 
  • Amaravati 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS