అంబానీకి ఆ హోటల్ ఫుడ్ అంటే మస్తు ఇష్టమట

Update: 2020-02-19 02:30 GMT
ప్రపంచ సంపన్నుల్లో టాప్ 15 స్థానాల్లో ఒకడు.. భారతదేశ అపర కుబేరుడు అన్నంతనే ఆ పెద్ద మనిషి ఎవరో ఇచ్చే అర్థమైపోతుంది. నిజమే.. మీ అంచనా కరెక్టే రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. ఆయన నివసించే ఇంటి విలువ దగ్గర దగ్గర రూ.27వేల కోట్లుగా చెబుతారు. ఈ ఇంట్లో పని చేసేందుకే 600 మంది సిబ్బంది ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వంట చేసేందుకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన వంటగాళ్లు పెద్ద ఎత్తున ఉంటారు. అంబానీ ఫ్యామిలీకి ఇష్టమైన పుడ్ ను అందించటం తో పాటు.. ఎప్పుడేం కావాలన్నా సమకూర్చేందుకు సిద్ధంగా ఉంటారు.

మరి.. అలాంటి అంబానీ తనకు ఏదైనా ఇష్టంగా తినాలనిపిస్తే ఎక్కడికి వెళతారు? అన్న ప్రశ్నకు.. ఏదో ఒక ప్రముఖ రెస్టారెంట్ కు వెళతారన్నదే సమాధనమైతే అది తప్పే అవుతుంది. ఎందుకంటే.. ఈ సంపన్నుడికి ఇష్టమైనది సామాన్యులంతా వెళ్లే ఒక సాదాసీదా హోటల్. ముంబయి కింగ్స్ సర్కిల్ లోనికేఫ్ మైసూర్ రెస్టారెంట్ అంబానీకి ఫేవరెట్ హోటల్ గా చెబుతారు.

1930లో స్థాపించిన ఈ హోటల్ తర్వాతి కాలంలో ముంబయి లో నాలుగు బ్రాంచులు ఓపెన్ చేశారు. నిజానికి ఈ హోటల్ ఓనర్ ప్రయాణం తొలుత కింగ్స్ సర్కిల్ రైల్వేస్టేషన్ వద్ద బండి పై దోశెలు వేసేవాడు. తర్వాత అతగాడి వంట రుచి ముంబయి మొత్తానికి తెలీటం తో రెస్టారెంట్ స్టార్ట్ చేయటం.. ఇప్పుడు నాలుగు రెస్టారెంట్లు అతనికి ఉన్నాయి.

ముకేశ్ అంబానీ చదువుకునే రోజుల నుంచి ఈ హోటల్ ఆయనకు సుపరిచితం. ఇక్కడ లభించే సాంబార్ ఇడ్లీ ముకేశ్ అంబానీకి చాలా ఇష్టం. ఎప్పుడైనా.. ఈ హోటల్ కు వెళ్లినప్పుడు సాంబార్ ఇడ్లీని ఆర్డర్ చేస్తారని చెబుతారు. దేశం లో అత్యధికులు తినే అల్పాహారమైన ఇడ్లీనే.. దేశంలోనే అపర కుబేరుడి గా కీర్తించే అంబానీకి ఇష్టం కావటం గమనార్హం. అంతేకాదు.. ఈ హోటల్ లో అంబానీకి నచ్చిన ప్లేట్ ఇడ్లీ సాంబార్ ధర రూ.45 మాత్రమేనట. అపర కుబేరుడే అయినా.. అలవాట్లలో మాత్రం సామాన్యుడిగా ఉండే అంబానీ సమ్ థింగ్ స్పెషల్ అని చెప్పక తప్పదు.
Tags:    

Similar News