ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే : తమిళనాడులో గెలిచేది ఆ పార్టీనే !
తమిళనాడులో ఏ పార్టీ గెలుస్తుంది అన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉంది.;
తమిళనాడులో ఏ పార్టీ గెలుస్తుంది అన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉంది. అక్కడ ఈసారి ఎన్డీయే అధికారంలోకి రావడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తోంది. అన్నా డీఎంకే పొత్తు పెట్టుకుని మరీ బరిలోకి దిగింది. ఇక అధికార డీఎంకే వరసగా రెండోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. స్టాలిన్ నాయకత్వంలో ఈ పొలిటికల్ ఫీట్ ని సాధించాలని పట్టుదలగా ఉంది. ఇక దళపతిగా వెండితెర మీద హీరోగా అశేషమైన అభిమానులను సంపాదించుకున్న విజయ్ టీవీకే పార్టీతో ముందుకు వస్తున్నారు. దాంతో త్రిముఖ పోరుగానే తమిళనాట ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఎవరు విజేత అవుతారు అన్నది జాతీయ స్థాయిలోనూ చర్చగా ఉంది.
ప్రీ పోల్ సర్వేతో :
ఈ నేపథ్యంలో హైదరాబాద్ కి చెందిన ఎస్ఏఎస్ సర్వే సంస్థ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనాభిప్రాయం పట్టే ప్రయత్నం చేసింది. మార్చి 27 దాకా సేకరించిన అభిప్రాయాల మేరకు అక్కడ ఎవరు అధికారం చేపట్టబోతున్నారో నాడి పసిగట్టే ప్రయత్నం చేసింది. దాని ప్రకారం చూస్తే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఈ ప్రీ పోల్ సర్వేను శాస్త్రీయంగా ఎస్ఏఎస్ సంస్థ చేసింది. ఎస్సీ ఎస్టీ ఓటర్లు, అలాగే బీసీ ఓటర్లు, ఓసీ కమ్యూనిటీస్, వివిధ ఏజ్ గ్రూపుల వారీగా జనాలను కలసి అభిప్రాయం కలెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులతో పాటు కళా శాల యూనివర్శిటీ విద్యార్ధుల నుంచి అభిప్రాయం కలెక్ట్ చేసింది. ఇక వివిధ వృత్తుల వారితో పాటు మహిళలు, రైతులు చిన్న వ్యాపారుల నుంచి కూడా సర్వేలో అభిప్రాయం తెలుసుకున్నారు.
పనిచేసే ఫ్యాక్టర్లు :
తమిళనాడు ఎన్నికల్లో ప్రధాన ఫ్యాక్టర్లుగా నిరుద్యోగం, లా అండ్ ఆర్డర్, మహిళా భద్రత, మద్యం, డ్రగ్స్, తమిళ ఆత్మగౌరవం, తమిళ భాష, అధికార కూటమి మీద అవినీతి ఆరోపణలు, డీఎంకే విశాలమైన కూటమి ఏర్పాటు, ఏఐడీఎంకే బలహీనతలు బీజేపీతో పొత్తు, టీవీకే పార్టీ ప్రభావం, జయలలిత మృతి తరువాత ఏఐడీఎంకేలో నాయకత్వ కొరత, చోటు చేసుకున్న పరిణామాలు ఇవన్నీ ఎన్నికల్లో బలమైన ఫ్యాక్టర్లుగా ప్రభావం చూపించబోతున్నాయి అని ఎస్ఎస్ఏ సర్వే అంచనా వేసింది.
స్టాలిన్ కే మద్దతు :
ఇక ఎస్ఏఎస్ సర్వే ప్రకారం కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్న దానికి 43 శాతం మద్దతు ఇవ్వగా, ఏఐ డీఎంకే నాయకుడు పళనిస్వామికి 36 శాతం, విజయ్ కి 16 శాతం, ఇతరులకు 2 శాతం మద్దతు లభించింది. అదే విధంగా డీఎంకేకు 41 శాతం ఓటింగ్ శాతం లభిస్తే అన్నా డీఎంకేకి 387.5 శాతం ఓటు షేర్ లభించవచ్చు అని ఈ సర్వే అంచనా వేసింది. ఇక టీవీకేకి 14 శాతం, ఎంటీకేకి 4.5 శాతం, ఇతరులకు 2 శాతం దక్కుతుందని ప్రీ పోల్ సర్వే పేర్కొంది.
బలమైన క్యాడర్ తో :
అదే విధంగా డీఎంకే బలమైన క్యార్ తో ఉందని 48 శాతం, ఏఐఏడీఎంకే ఉందై 35 శాతం, టీవీకే ఉందని 10 శాతం ఇతరులు అని 3 శాతం అభిప్రాయపడ్డారు. డీఎంకే సంక్షేమ పథకాల పట్ల 37 శాతం సంతృప్తి వ్యక్తం చేస్తే ఫరవాలేదు అన్న వారు 20 శాతం బాగా లేదు అన్న వారు 34 శాతం ఉన్నారు. అలగే ప్రభుత్వ అవినీతి మీద 25 శాతం ఉంది అని అంటే ఒక మాదిరి అన్న వారు 18 శాతం, లేదు అన్న వారు 38, శాతం ఉన్నారు. తమిళనాడుని ఏ పార్టీ కాపాడుతుంది అంటే డీఎంకేకు 43 శాతం, అన్నా డీఎంకేకి 38 శాతం, టీవీకేకి 12 శాతం, ఇతరులకు ఆరు శాతం మద్దతు ఇచ్చారు.
సంక్షేమం మీదనే :
సంక్షేమ పధకాలు చూసి ఓటేస్తామని 13 శాతం చెబితే లా అండ్ ఆర్డర్ చూసి ఓట్లేస్ద్తామని 11 శాతం మహిళా భద్రత కోసం 10 శాతం, తమిళనాడు గుర్తింపు కోసం 10 శాతం, మతం చూసి 3 శాతం, ధరల పెరుగుదల విషయంలో ఆగ్రహంతో 13 శతం, అరోగ్యం, విద్య విషయం చూసి ఓటేసే వారు 8 శాతం, ఓవరాల్ డెవలప్మెంట్ చూసి ఓటేసే వారు 9 శాతం, మద్యం డ్రగ్స్ నియంత్రణ విషయంలో పార్టీలు ఇచ్చే హామీలను చూసి 12 శాతం ఓటేస్తామని చెబుతున్నారు.
డీఎంకే పనితీరు మీద :
అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న డీఎంకే పనితీరు మీద బాగుంది అన్న వారు 36 శాతం ఉంటే ఏవరేజ్ అన్న వారు 18 శాతం ఉన్నారు. బ్యాడ్ అన్న వారు 37 శాతం ఉన్నారు. టీవీకే పార్టీ ప్రభావం ఓట్ల చీలికకే అన్న వారు 49 శాతం మంది, కింగ్ అవుతుందని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పిన వారు 13 శాతం మంది, కింగ్ మేకర్ అన్న వారు 20 శాతం మంది ఉన్నారు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతో ఓటు వేసే వారు 34 శాతం ఉన్నారని సర్వేలో తేలింది. టీవీకే ఏ పార్టీ ఓటు షేర్ ని ప్రభావితం చేస్తుంది అంటే డీఎంకే అన్న వారు 32 శాతం ఉంటే అన్నా డీఎంకే అన్న వారు 30 శాతం ఉన్నారు. బీజేపీ అన్న వారు 3 శాతం ఉన్నారు.
సీట్లు ఎవరికి ఎంత :
ఎస్ఏ స్ సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు లభిస్తాయన్నది చూస్తే కనుక నార్తర్న్ రీజియన్ లో సీట్లు 69 కి గానూ డీఎంకేకు 34 నుంచి 36, అన్నా డీఎంకేకి 33 నుంచి 35, టీవీకేకి ఒకటి లేదా రెండు లభిస్తాయని తేలింది. కొంగునాడు రీజియన్ లో 68 సీట్లు ఉంటే అందులో డీఎంకేకు 26 నుంచి 28 దాకా వస్తే అన్నా డీఎంకేకి 40 నుంచి 43 దాకా వస్తాయని తేలింది. టీవీకేకి 2 నుంచి మూడు వస్తాయని సర్వే చెబుతోంది. అలాగే డెల్టా రీజియన్ లో 46 సీట్లు ఉంటే డీఎంకేకి 35 నుంచి 38, అన్నా డీఎంకేకి 10 నుంచి 13, టీవీకేకు ఒకటి నుంచి రెండు వస్తాయని చెబుతున్నారు. సౌతర్న్ రీజియన్ లో 51 సీట్లు ఉంటే డీఎంకేకు 24 నుంచి 26, అన్నా డీఎంకేకి 25 నుంచి 26, టీవీకేకి ఒకటి నుంచి రెండు దక్కుతాయని ఇతరులకు కూడా ఒకటి నుంచి రెండు వస్తాయని సర్వే అంచనా వేసింది. మొత్తంగా చూస్తే డీఎంకేకు 119 నుంచి 128 దాకా అన్నా డీఎంకేకి 108 నుంచి 117 దాకా టీవీకేకు 5 నుంచి 9 దాకా సీట్లు రావచ్చు అని లెక్క కట్టింది. ఇది మొదటి విడత సర్వేగా ఎస్ఏఎస్ సర్వే నిర్వాహకులు చెబుతున్నారు.