ఎస్ఏఎస్ సర్వే : అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతోందా ?

హైదరాబాద్ కి చెందిన ఎస్ఏఎస్ సర్వే సంస్థ అస్సాంలో ఫిబ్రవరి 30 నుంచి మార్చి 26 వరకూ చేసిన ప్రీ పోల్ సర్వేలో అనెక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.;

Update: 2026-03-30 17:44 GMT

హైదరాబాద్ కి చెందిన ఎస్ఏఎస్ సర్వే సంస్థ అస్సాంలో ఫిబ్రవరి 30 నుంచి మార్చి 26 వరకూ చేసిన ప్రీ పోల్ సర్వేలో అనెక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. అక్కడ 2016 నుంచి వరసగా రెండు సార్లు బీజేపీ అధికారంలో ఉంది. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ చూస్తోంది. అదే సమయంలో ఈసారి ఎలాగైనా తమదే విజయం అని కాంగ్రెస్ గట్టి నమ్మకం పెట్టుకుంది. మరి ఏకంగా 26,400 దాకా శాంపిల్స్ తో శాస్త్రీయ విధానంలో ఎస్ఏఎస్ సర్వే సంస్థ చేసిన ఈ ప్రీ పోల్ సర్వే అస్సాం వర్తమాన రాజకీయ ముఖ చిత్రాన్ని ఆవిష్కరించింది.

జనాలలో ఏముంది :

ఇక ఎస్సీ ఎస్టీ బీసీలు వయోజనులు, యువత, మహిళలు, రైతులు సన్న కారు చిన్న కారు వ్యాపారులు, ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు వివిధ మతాలకు చెందిన వారు ప్రాంతాలకు చెందిన వారు ఇలా అందరినీ ఎస్ఏఎస్ సర్వే సంస్థ కలసి వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. అదే విధంగా 18 నుంచి 65 ఏళ్ల పైబడిన వారి దాకా అందరి ఓటర్ల అభిప్రాయాలను తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం మీద సంతృప్తి ఎంత ఉంది, అసంతృప్తి ఎంత ముంది అన్నది కూడా ఈ సర్వేలో తేలింది.

బలమైన ఫ్యాక్టర్లుగా :

ఈ ఎన్నికల్లో బలమైన ఫ్యాక్టర్లుగా అక్రమ వలసలు, అలాగే బీజేపీ పాలనలో నిరుద్యోగం, అవినీతి, కాంగ్రెస్ లో అంతర్గత పోరు, డీలిమిటేషన్, మహిళలు, విద్యార్ధుల ఖాతాలో నేరుగా నగదు బదిలీ చేయడంతో పాటు ప్రస్తుతం బీజేపీ ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వ శర్మకు ధీటైన ప్రత్యర్ధి ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ లో లేకపోవడం కూడా ఈ ఎన్నికల్లో బలమైన ఫ్యాక్టర్ గా పనిచేస్తోంది అని అంటున్నారు.

కాబోయే సీఎం ఎవరంటే :

ఈసారి ఎన్నికల తరువాత కొత్త ముఖ్యమంత్రి ఎవరు అంటే 49 శాతం మంది హిమంత్ బిశ్వ శర్మకు ఓటేశారు. కాంగ్రెస్ అధినేత గౌరవ్ గొగోయ్ కి 40 శాతం మద్దతు ఇస్తే అఖిల్ గొగోయ్ కి 3 శాతం మద్దతు ఇచ్చారు. ఏ పార్టీ కూటమికి మొగ్గు ఉంది అంటే ఎన్డీయే కూటమికి 43 శాతం కాంగ్రెస్ కూటమికి 37 శాతం ఏఇ యూడీఫ్ కి 8 శాతం ఇతరులకు 4 శాతం మద్దతు ఇచ్చారు. హిమంత్ బిశ్వ శర్మ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమ్మీద సంతృప్తి 40 శాతం ఉంటే భేష్ అన్న వారు 20 శాతం మంది ఉన్నారు అసంతృప్తిగా ఉన్న వారు 32 శాతం ఉన్నారు. ఎవరి హయాంలో అస్సాం అభివృద్ధి చెందింది అంటే ఎన్డీయే అని 46 శాతం, కాంగ్రెస్ అని 40 శాతం, ఇతరులు అని 6 శాతం మద్దతు తెలిపారు.

ప్రభావితం చూపే అంశాలు :

ఎన్నికల్లో ప్రభావితం చూపే అంశాలుగా నిరుద్యోగం 17 శాతం ఉంటే అక్రమ వలసలు 6 శాతం, ధరల పెరుగుదల 11 శాతం, పారిశ్రామిక అభివృద్ధి లేమి 10 శాతం, అవినీతి 12 శాతం వరదలు పునరావాస సమస్యలు అని 14 శాతం, సంక్షేమ పధకాలు అని 16 శాతం అభిప్రాయపడ్డారు బీజేపీ ప్రభుత్వం మీద బాగుంది అన్న వారు 45 శాతం ఉంటే పరవాలేదు అన్న వారు 17 శాతం, బాగా లేదు అన్న వారు 33 శాతం ఉన్నారు. ఎమ్మెల్యేల మీద అత్యంత వ్యతిరేకత 32 శాతం ఉంటే వ్యతిరేకత 39 శాం, ఒక మాదిరి వ్యతిరేకత 13 శాతం ఉంది అని జనాలు చెబుతున్నారు. బీజేపీ పాలనలో లా అండ్ ఆర్డర్ తీరు పట్ల 17 శాతం సంతృప్తి చెందుతూంటే అభివృద్ధి మీద 18 శాతం, అక్రమ వలసల నియంత్రణ మీద 20 శాతం ఆరోగ్యం, విద్య విషయంలో 17 శాతం, సంక్షేమ పధకాలు విషయంలో 24 మంది సంతృప్తిగా ఉన్నారు. అసంతృప్తిగా ఉన్న అంశాలు చూస్తే కనుక వరదలు పునరావాసం విషయంలో 21 శాతం అవినీతి మీద 32 శాతం, నిరుద్యోగం మీద 33 శాతం మంది పెదవి విరుస్తున్నారు. మహిళలకు విద్యార్థులకు నగదు బదిలీ పథకం వల్ల బీజేపీకి మేలు జరుగుతుందని 47 శాతం మంది అభిప్రాయపడ్డారు

ఎవరికి ఎన్ని సీట్లు :

ఇక ప్రీ పోల్ సర్వే అంచనాల మేరకు చూస్తే ఎన్డీయేకు 45 శాతం, కాంగ్రెస్ కి 40 శాతం, ఇతరులకు 7.5 శాతం ఓటు షేర్ దక్కవచ్చు అని తేలుతోంది. అదే విధంగా ఎవరికి ఎన్ని సీట్లు అన్నది చూస్తే అప్పర్ అస్సాంలో 35 సీట్లు ఉంటే ఎన్డీయేకు 21 నుంచి 22, కాంగ్రెస్ కి 14 నుంచి 15, లోయర్ అస్సాంలో 44 సీట్లు ఉంటే ఎన్డీయేకు 27 నుంచి 28, కాంగ్రెస్ కి 15 నుంచి 16, ఇతరులకు 2 నుంచి 3 దాకా, సెంట్రల్ అస్సాంలో 19 సీట్లు ఉంటే ఎన్డీయేకి 13 నుంచి 14, కాంగ్రెస్ కి 6 నుంచి 7, నార్త్ అస్సాంలో 15 సీట్లు ఉంటే ఎన్డీయేకు 9 నుంచి 10, కాంగ్రెస్ కి 5 నుంచి 6, ఇతరులకు 1 నుంచి 2 సీట్లు బరాక్ వాలీలో 13 సీట్లు ఉంటే ఎన్డీయేకు 6 నుంచి 7, కాంగ్రెస్ కి 5 నుంచి 6, ఇతరులకు 2 నుంచి 4 దక్కుతాయని ప్రీ పోల్ సర్వే చెబుతోంది. మొత్తం 126 సీట్లలో ఎన్డీయేకు 76 నుంచి 81, కాంగ్రెస్ కి 45 నుంచి 50, ఇతరులకు 5 నుంచి 9 దాకా రావచ్చు అని అంచనా కట్టింది.




Tags:    

Similar News