జగన్ ఢిల్లీ టూర్ టైమింగ్ ఓకేనా ?
ఇపుడు మ్యాటర్ అది కాదు, జగన్ ఈ సమయంలో ఢిల్లీకి వెళ్ళడం వల్ల వైసీపీకి వచ్చే లాభం సంగతి ఏమిటో ఎవరికీ తెలియదు కానీ రాజకీయంగా భారీ ఇబ్బందులు వస్తాయన్న చర్చ అయితే సాగుతోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ వచ్చే వారం ఉండొచ్చు అని వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. అది కూడా వైసీపీ అనుకూల మీడియాలో కాదు వ్యతిరేక మీడియాలో వస్తున్నాయి. జగన్ ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని హోం మంత్రిని అమిత్ షాను కలుస్తారు అన్నది ఆయా వార్తల సారాంశం. తన మీద పార్టీ నేతల మీద ఉన్న కేసుల గురించి ఆయన మాట్లాడుతారు అని కూడా వార్తలలో రాస్తున్నారు. సరే ఈ తరహా వార్తలు గతంలోనూ వచ్చాయి. వీటి వల్ల వైసీపీకి రావాల్సిన మైనస్ పాయింట్లు ఇప్పటికే వచ్చేశాయి. ఇపుడు మ్యాటర్ అది కాదు, జగన్ ఈ సమయంలో ఢిల్లీకి వెళ్ళడం వల్ల వైసీపీకి వచ్చే లాభం సంగతి ఏమిటో ఎవరికీ తెలియదు కానీ రాజకీయంగా భారీ ఇబ్బందులు వస్తాయన్న చర్చ అయితే సాగుతోంది.
విద్యార్థుల ఆందోళనలు :
ఈ రోజున చూస్తే ఢిల్లీ వీధులలో విద్యార్ధుల ఆందోళనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అంతే కాదు వేడిక్కిన రాజకీయంతో అట్టుడుకుతోంది. ఇక బీజేపీ వర్సెస్ జెన్ జీ యువత అని కూడా ప్రచారం సాగుతోంది. యువత పెద్ద ఎత్తున నినదిస్తోంది. ఒక విధంగా ఈ అందోళనల ప్రభావం దేశమంతా ఉంది. కేంద్రం సైతం దిగి వచ్చి ఇప్పటికి రెండు సార్లు సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపింది అంటే విషయం ఎంత సీరియస్ గా ఉందో అర్ధం అవుతోంది. ఇక ఈ నెల 20న జరిగిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థుల మీద లాఠీ చార్జి చేశారు అన్నది కూడా యావత్తు విద్యార్థి లోకంలో ఆవేశం కలిగింది. దాంతో తాజాగా దేశమంతటా విద్యార్ధి సంఘాలు బంద్ కి పిలుపు ఇస్తే మంచి స్పందన లభించింది. ఒక విధంగా దేశ రాజకీయం అయితే ఉద్రిక్తంగా ఉంది. ఒక పెద్ద సెక్షన్ కేంద్ర పాలకుల తీరు మీద గుర్రుగా ఉంది అని అంటున్నారు.
చర్చలు ఏమైనా :
ఇక చూస్తే వైసీపీ అధినేతతో కేంద్ర బీజేపీ నాయకత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే డీలిమిటేషన్ మహిళా బిల్లుల గురించి చర్చిస్తుందని అంటున్నారు. అదే విధంగా మద్దతు కోరుతుందని అంటున్నారు. ఇప్పటికే దిగ్గజ నేత మరాఠీ యోధుడు శరద్ పవార్ తో కూడా బీజేపీ పెద్దలు చర్చించారు. ఇపుడు వరస క్రమంలో వైసీపీ అధినేతతో చర్చిస్తారు అని అంటున్నారు. ఇక వైసీపీ కూడా రెండేళ్ల ఏపీలో కూటమి పాలన మీద తమకు ఉన్న అభ్యంతరాలు ఫిర్యాదులు కూడా చేసేందుకు సిద్దపడుతోందని అందుకు ఈ అవకాశాన్ని వాడుకుంటుందని కూడా ప్రచారం సాగుతోంది. ఇదంతా మంచిదే కానీ ఇపుడు చూస్తే సరైన సమయం కాదేమో అని అంటున్నారు.
జెన్ జీ ధర్మాగ్రహం :
ఇపుడు తరం ధర్మాగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్ర పాలకుల తీరు మీద కూడా మండిపడుతోంది. అలాగే తమ ఆవేశానికి ఆందోళనకు కలసి వచ్చే పార్టీలేవో విడిగా ఉండేవేవో కూడా జెన్ జీ తరం జాగ్రత్తగానే గమనిస్తోంది. ఇప్పటిదాకా వైసీపీ మీద ఫోకస్ అయితే లేదు. న్యూట్రల్ గానే ఉంది కాబట్టి అని అంటున్నారు. ఇపుడు కేంద్ర పెద్దలతో నేరుగా భేటీ అయి తాము కూడా ఎన్డీయేకు బయట నుంచి మద్దతు ఇచ్చే మిత్రులమని అన్నట్లుగా ముద్ర వేసుకోవడం వల్ల లాభం కంటే నష్టమే అధికం అని అంటున్నారు. డీలిమిటేషన్ మహిళా బిల్లులకు వైసీపీ మద్దతు ఇవ్వడంలో అభ్యంతరాలు లేవు ఇక కేంద్ర పెద్దలతో భేటీకి మరో సందర్భం చూసుకుంటే బాగుంటుందేమో అన్నది కూడా చర్చగా ఉంది అని అంటున్నారు. మరి ఎందుకు వైసీపీ కలుస్తోంది, కేంద్ర పెద్దలు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు అన్నది పూర్తిగా తెలిస్తే కానీ ఈ రాజకీయ లాభనష్టాల వ్యవహారం మీద పూర్తి క్లారిటీ రాదని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.