పిఠాపురానికి కొత్త రూపం.. ప‌వ‌న్ క‌ల్యాణ్

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌న‌సు పెట్టేశారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం రూపు రేఖ‌ల‌ను స‌మూలంగా మార్చేశారు.. ఈ మాట అన్న‌ది జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌తో ప‌వ‌న్ అభిమానులో కాదు.. సాక్షాత్తూ.. పిఠాపురం ప్ర‌జ‌లే!.

Update: 2026-09-21 17:30 GMT

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌న‌సు పెట్టేశారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం రూపు రేఖ‌ల‌ను స‌మూలంగా మార్చేశారు.. ఈ మాట అన్న‌ది జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌తో ప‌వ‌న్ అభిమానులో కాదు.. సాక్షాత్తూ.. పిఠాపురం ప్ర‌జ‌లే!. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సోమ‌వారం ప‌ర్య‌టించారు. దాదాపు నాలుగు మాసాల త‌ర్వాత‌.. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌డం గ‌మ‌నార్హం.

ఈ సంద‌ర్భంగా ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తోపాటు.. ఆధునిక హంగుల‌తో తీర్చిదిద్దిన‌.. అంగ‌న్‌వాడీ కేంద్రాన్ని కూడా ప‌వ‌న్ కల్యాణ్ ప్రారంభించారు. తొలుత ఫకృద్ధీన్ పాలెంలో సుందరీకరించిన మైసమ్మ చెరువును ప్రారంభించారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన ద్వారా 73 లక్షల రూపాయ‌ల‌ వ్యయంతో మైసమ్మ చెరువు అభివృద్ధి చేశారు. చెరువు గట్టుపై వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ తదితర సౌకర్యాల ఏర్పాటు చేశారు.

అనంత‌రం.. కాకినాడ నియోజకవర్గం పరిధిలో ఆధునీక‌రించిన 14 చెరువులకు సంబంధించి ఫోటో గ్యాలరీని ప‌వ‌న్ క‌ల్యాణ్ వీక్షించారు .చెరువుకు అనుబంధంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించారు. ఫకృద్ధీన్ పాలెంలోని గ్రామ సచివాలయ భవనాన్ని, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించారు. మొత్తం రెండు రోజుల పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురంలో ప‌ర్య‌టించ‌నున్నారు. రూ. 1,500 కోట్ల రూపాయ‌ల‌తో చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్ట‌నున్నారు.

నియోజకవర్గ సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని దాదాపు రూ. 1,500 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి, సంక్షేమ పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. పీఠికాపురవనం దీనిలో హైలెట్‌గా నిలి చింది. జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మించిన `పీఠికాపురవనం`ను ప్రారంభించారు. ఇతర కార్యక్రమాలు: అగ్రహారంలో అపోలో హాస్పిటల్ సౌజన్యంతో నిర్మించిన మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు చందుర్తి రోడ్డు పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ఆర్‌ఆర్‌బీహెచ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొంటారు.

Tags:    

Similar News