కుప్పంను క‌బ‌ళించాల‌ని చూశారు.. వైసీపీపై చంద్ర‌బాబు ఫైర్‌

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అభివృద్ది ప్రాజెక్టుల‌కు ఆయ‌న శ్రీకారం చుట్టారు.

Update: 2026-09-21 16:45 GMT

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అభివృద్ది ప్రాజెక్టుల‌కు ఆయ‌న శ్రీకారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌మావేశంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. కుప్పం ప్ర‌జ‌ల‌కు తాను, త‌న కుటుంబం ఎప్ప‌టికీ రుణ ప‌డి ఉంటుంద‌న్నారు. కుప్పంతో త‌న‌కు ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌ని.. అది కుటుంబం కంటే కూడా ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పారు. కుప్పం ప్ర‌జ‌ల‌కు ఎంత చేసినా.. త‌క్కువేన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

``కుప్పంలో ఏదో ఘ‌న కార్యం చేస్తున్నామ‌ని.. కొంద‌రు ప్ర‌య‌త్నించారు. కుప్పం ప్ర‌జ‌ల‌ను మోసం చేయాల‌ని చూ శారు. కుప్పంను కూడా క‌బ‌ళించి దోపిడీ చేయాల‌ని అనుకున్నారు. కానీ, ఇక్క‌డి ప్ర‌జ‌లు క‌ర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పుడు ఆ నాయ‌కులు.. ముసుగులు వేసుకుని తిరుగుతున్నారు. `` అని చంద్ర‌బాబు అన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో నే కాకుండా.. జిల్లా, రాష్ట్రం అంత‌టా కుప్పం గురించి మాట్లాడుకుంటోంద‌ని తెలిపారు. ప్ర‌తి అంశాన్నీ నిశితంగా గ‌మ‌నిస్తున్న‌ట్టు చెప్పారు. అభివృద్ది దిశ‌గా రాష్ట్రాన్ని న‌డిపిస్తున్నామ‌న్నారు.

హెరిటేజ్ గ్రానైట్ క్ల‌స్ట‌ర్ జోన్ ఏర్పాటు చేయ‌డం ద్వారా.. కుప్పంలో ప‌ర్యాట‌కాన్ని ప్రోత్స‌హించ‌నున్న‌ట్టు చంద్ర‌బా బు చెప్పారు. ప్ర‌తి ఇంట్లోనూ ఆర్థికంగా అభివృద్ధి చెందాల‌న్న ఉద్దేశంతో కుప్పంలోని అన్ని మండలాల్లోనూ సౌర శ‌క్తి కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామ‌న్నారు. కుప్పంలో తాగునీటి స‌మ‌స్య‌లు రాకుండా చూస్తున్నామ‌న్నారు. స్వ‌ర్ణ కుప్పం.. స్వ‌చ్ఛ‌కుప్పం.. కార్య‌క్ర‌మం ద్వారా నియోజ‌క‌వ‌ర్గాన్ని తీర్చిదిద్దుతున్నామ‌న్నారు. ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు సంక్షేమాన్ని అందిస్తున్న‌ట్టు చెప్పారు.

`సంజీవ‌నిని నేనే మానిట‌ర్ చేస్తా` అని చంద్ర‌బాబు చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గంలో సంజీవ‌ని ప్రాజెక్టు ద్వారా ప్ర‌జ‌ల ఆరోగ్యానికి మేలు చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టు డిసెంబ‌రు నుంచి అం దరికీ అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవాల‌ని చంద్ర‌బాబు సూచించా రు. చేతిలోనిసెల్ ఫోన్‌.. కేవ‌లం మాట్లాడేందుకు మాత్ర‌మే కాద‌ని.. దాని ద్వారా ప్ర‌భుత్వ సేవ‌ల‌ను కూడా పొందే వెసులుబాటు ఉంద‌ని చెప్పారు. కుప్పం ప్ర‌జ‌ల‌కు తాను ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాన‌న్నారు.

Tags:    

Similar News