• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  పవన్ విడాకులు.. అసలు...

పవన్ విడాకులు.. అసలు చట్టం ఏం చెబుతోంది!

| పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా విడాకుల వార్తల నేపథ్యంలో మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్‌పై చర్చ జరుగుతోంది. భారత చట్టాల ప్రకారం విడిపోవాలని ప్రకటన చేసినంత మాత్రాన విడాకులు పూర్తికావు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, నిర్దేశిత ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే విడాకులు మంజూరవుతాయి. పిల్లల కస్టడీ, భరణం, ఆస్తుల అంశాలను కూడా కోర్టు పరిశీలిస్తుంది.

By - M Prashanth
Update: 2026-11-10 12:51 GMT

పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా 13 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు రిపోర్ట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే భార్యాభర్తలు ఇద్దరూ విడిపోవడానికి అంగీకరిస్తే వెంటనే విడాకులు వచ్చేస్తాయా, కోర్టులో ఎలాంటి ప్రక్రియ ఉంటుంది, పిల్లల బాధ్యతలు, భరణం వంటి విషయాలను ఎలా నిర్ణయిస్తారనేది అందరిలో కలుగుతున్న సందేహాలు.

ఇక భారత చట్టాల ప్రకారం భార్యాభర్తలు ఇద్దరూ అంగీకరించి విడాకులు తీసుకునే విధానాన్ని 'డివోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్' అంటారు. ఇందుకోసం ఇద్దరూ కలిసి కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. అయితే కేవలం విడిపోతున్నట్లు ప్రకటన ఇచ్చినంత మాత్రాన చట్టపరంగా వివాహ బంధం ముగిసినట్లు కాదు. కోర్టు విడాకుల ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే ఆ ప్రక్రియ పూర్తవుతుంది.

స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌లోని సెక్షన్ 28 ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకులు కోరుకునే దంపతులు కనీసం ఏడాది పాటు విడిగా జీవించి ఉండాలి. ఒకే ఇంట్లో ఉన్నా భార్యాభర్తలుగా కలిసి జీవించకపోతే కొన్ని సందర్భాల్లో దానిని విడిగా ఉన్నట్లుగానే పరిగణిస్తారు. అయితే ఆ పరిస్థితులను కోర్టు పరిశీలిస్తుంది. నార్మల్ గా పిటిషన్ దాఖలు చేసిన ఆరు నెలల తర్వాత ఇద్దరూ మరోసారి తమ అంగీకారాన్ని కోర్టుకు తెలియజేయాలి. దీనిని సెకండ్ మోషన్ అంటారు.

దంపతులు తమ నిర్ణయాన్ని మరోసారి ఆలోచించుకోవడానికి ఈ గడువు ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆరు నెలల గడువును మినహాయించే అవకాశం కూడా ఉంది. ఇద్దరి మధ్య సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం లేదని కోర్టు భావిస్తే, వర్తించే చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. ఇక భరణం, పిల్లల కస్టడీ, ఆస్తుల వ్యవహారాలను కూడా విడాకుల సమయంలో పరిష్కరించుకుంటారు.

భార్యాభర్తలు వీటిపై ముందుగానే అంగీకారానికి రావచ్చు. పిల్లల విషయంలో వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తారు. తల్లిదండ్రులు చేసుకున్న ఒప్పందాన్ని కూడా కోర్టు పరిశీలించవచ్చు. పవన్, అన్నా వేర్వేరు మతాలకు చెందినవారు కావడంతో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రస్తావన వస్తోంది. అయితే వారి వివాహం ఏ చట్టం కింద నమోదైందనే దానిపైనే విడాకులకు వర్తించే నిబంధనలు ఆధారపడి ఉంటాయి. ఇక ఇద్దరూ పిల్లల బాధ్యతలను కలిసి చూసుకుంటామని ప్రకటనలో ఉంది. ఇక నెక్స్ట్ ఈ విషయంలో ఈ ఇద్దరి నుంచి మరో క్లారిటీ ఏమైనా వస్తుందేమో చూడాలి.

Tags:    
  • pawankalyan 
  • annalezhneva 
  • mutualconsentdivorce 
  • divorcelaws 
  • indianlaw 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

కోర్టు నిర్ధోషి అని తేల్చేసినా 7ఏళ్లు జైల్లోనే మ‌గ్గాడు.. ఈ న‌ర‌కానికి ప‌రిహారం 30ల‌క్ష‌లు!

2026-11-17 04:07 GMT

సెకండ్స్‌లో డ‌మ్మీ ఐఫోన్ అమ్మిన షాప్‌కి వినియోగ‌దారుల క‌మిష‌న్ ఝ‌ల‌క్!

2026-11-16 04:22 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

అరెస్ట్ అయితే చాలు.. ఇక 'ఉద్యోగానికి' సెలవు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పుతో అవినీతి తిమింగలాలకు వణుకు

2026-11-10 06:00 GMT

ఓబీసీ క్రీమీలేయ‌ర్‌.. మ‌రింత క‌ఠిన‌మా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది!

2026-11-07 13:45 GMT

భర్త మహాశయులారా? భార్యకు భరణం ఎగ్గొట్టే ప్లాన్ చేయకండి.. ఇలా బుక్కవుతారు..

2026-11-07 02:19 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS