• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  సెకండ్స్‌లో డ‌మ్మీ ఐఫోన్...

సెకండ్స్‌లో డ‌మ్మీ ఐఫోన్ అమ్మిన షాప్‌కి వినియోగ‌దారుల క‌మిష‌న్ ఝ‌ల‌క్!

| సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొనుగోలు చేసి మోసపోయిన హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మహిళకు వినియోగదారుల కమిషన్ న్యాయం చేసింది. రూ.29 వేలతో కొనుగోలు చేసిన ఐఫోన్ 3-4 రోజుల్లోనే పనిచేయడం ఆగిపోవడంతో ఆమె ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం దుకాణదారుడు రూ.29 వేలకు 9 శాతం వడ్డీతో పాటు, పరిహారంగా రూ.20 వేలు, కోర్టు ఖర్చులకు రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది.

By - Sivaji Kontham
Update: 2026-11-16 04:22 GMT

సెకండ్స్ లో ఐఫోన్ కొని మోస‌పోయిన వారికి వినియోగదారుల ఫోర‌మ్ ఎలాంటి స‌హ‌కారం అందించ‌దా? అలాంటి డ‌మ్మీ ఫోన్లు అమ్మే షాప్‌ల‌కు ముకుతాడు వేసే శిక్ష‌లు లేవా? అంటే.. ఇదిగో ఇక్క‌డ ఈ ఉదంతాన్ని ప‌రిశీలించాలి.

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొనుగోలు చేసి మోసపోయిన ఉదంతంలో వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు వెలువరించింది. చండీగఢ్‌కు చెందిన మొబైల్ షాప్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నాణ్యత లేని ఫోన్ అమ్మి.. తిరిగి బాగు చేసి ఇవ్వకుండా మోసం చేసినందుకు గాను దుకాణదారుడికి భారీ జరిమానా విధించింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని `ఉనా` ప్రాంతానికి చెందిన మమతా కద్యన్ అనే మహిళ 2023 అక్టోబర్ 27న చండీగఢ్‌లోని సెక్టర్ 22బీలో ఉన్న `ఆరోహి మొబైల్ హబ్` నుంచి రూ.29,000 వెచ్చించి సెకండ్ హ్యాండ్ బ్లూ కలర్ ఐఫోన్ 12ను కొనుగోలు చేశారు. సేల్స్ మ‌న్ ఇచ్చిన ఇన్‌వాయిస్‌పై ఆరు నెలల వారంటీ కూడా రాసిచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఆ హ్యాండ్‌సెట్ కొనుగోలు చేసిన కేవలం 3-4 రోజుల్లోనే పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది.

దీంతో బాధితురాలు 3 నవంబర్ 2023న సదరు దుకాణాన్ని సంప్రదించగా.. వారు ఫోన్‌ను వెనక్కి తీసుకుని రిపేర్ చేసి ఇస్తామని లేదా 15 రోజుల్లో పూర్తి డబ్బులు రీఫండ్ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆమె భర్త బ్యాంక్ ఖాతా వివరాలను కూడా సేకరించారు. కానీ రోజుల తరబడి ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేదు. చివరికి డబ్బులు లేదా ఫోన్ ఇవ్వమని 18 జనవరి 2024న కోరగా వారు నిర‌భ్యంత‌రంగా నిరాకరించడంతో బాధితురాలు లీగల్ నోటీసు పంపినా దుకాణం నుంచి ఎలాంటి జవాబు రాలేదు.

ఈ కేసును విచారించిన ఉనా జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు డి.ఆర్. ఠాకూర్- అనూప్ కుమార్ నేతృత్వంలోని బెంచ్.. దుకాణదారుల సేవల్లో తీవ్ర లోపం ఉందని తేల్చింది. బాధితురాలికి ఐఫోన్ అసలు ధర రూ.29,000తో పాటు దానికి 9శాతం వార్షిక వడ్డీ.. మానసిక వేదనకు పరిహారంగా రూ.20,000, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.10,000 చెల్లించాలని 2 నవంబర్ 2026న వెలువరించిన తీర్పులో ఆదేశించింది.

వినియోగ‌దారుల ఫోర‌మ్‌లో ఇలాంటి విజ‌యాలు ప్ర‌జ‌ల‌లో మ‌రింత న‌మ్మ‌కాన్ని పెంచుతాయి. అలాగే దుకాణ‌దారులో మ‌రింత బాధ్య‌త‌ను కూడా పెంచుతాయి. ముఖ్యంగా ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ‌రికీ తెలీదు. ఎంత పెద్ద మొత్తం ఖ‌ర్చు చేసినా గ్యారెంటీలు ఉండ‌వు. అందువ‌ల్ల వినియోగ‌దారుల ఫోర‌మ్ లు ప్ర‌జ‌ల త‌ర‌పున మ‌రింత స‌మ‌ర్థంగా ప‌ని చేయాల్సి ఉంటుంది. లేదంటే ఎవ‌రికీ ఎలాంటి భ‌రోసా లేక తీవ్ర మానిసిక సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. డ‌మ్మీ ఐఫోన్ కేసులో వినియోగ‌దారుడికి స‌రైన న్యాయం చేయ‌డంలో స‌ఫ‌ల‌మైన ఉనా జిల్లా వినోయ‌గ‌దారుల ఫోర‌మ్ ని అభినందించి తీరాలి.

Tags:    
  • iphone12 
  • consumercourt 
  • consumer rights 
  • secondhandiphone 
  • consumerforum 

Similar News

కోర్టు నిర్ధోషి అని తేల్చేసినా 7ఏళ్లు జైల్లోనే మ‌గ్గాడు.. ఈ న‌ర‌కానికి ప‌రిహారం 30ల‌క్ష‌లు!

2026-11-17 04:07 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

పవన్ విడాకులు.. అసలు చట్టం ఏం చెబుతోంది!

2026-11-10 12:51 GMT

అరెస్ట్ అయితే చాలు.. ఇక 'ఉద్యోగానికి' సెలవు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పుతో అవినీతి తిమింగలాలకు వణుకు

2026-11-10 06:00 GMT

ఓబీసీ క్రీమీలేయ‌ర్‌.. మ‌రింత క‌ఠిన‌మా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది!

2026-11-07 13:45 GMT

భర్త మహాశయులారా? భార్యకు భరణం ఎగ్గొట్టే ప్లాన్ చేయకండి.. ఇలా బుక్కవుతారు..

2026-11-07 02:19 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

మియాపూర్‌లో రూ. వేల కోట్ల భూములకు రక్షణ.. 23 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు తెర!

2026-10-30 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS