• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  ఓబీసీ క్రీమీలేయ‌ర్‌.....

ఓబీసీ క్రీమీలేయ‌ర్‌.. మ‌రింత క‌ఠిన‌మా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది!

| ఓబీసీ క్రీమీలేయర్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు తీర్పును గతం నుంచి అమలు చేయాల్సిన అవసరం లేదని, ఈ ఏడాది మార్చి 11 నుంచి మాత్రమే వర్తింపజేయాలని తెలిపింది. ఇప్పటికే నియామకాలు పూర్తై, పోస్టులు కేటాయించిన వారికి ఈ తీర్పు వర్తించదని స్పష్టం చేసింది. క్రీమీలేయర్ నిర్ణయంలో అభ్యర్థుల తల్లిదండ్రుల వేతనం, ఉద్యోగ స్థాయి, ఆస్తులను పరిశీలించాలని పేర్కొంది.

By - Garuda Media
Update: 2026-11-07 13:45 GMT

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల్లోని వివిధ శాఖ‌ల‌కు సంబంధించిన ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో ఆయా ప్ర‌భుత్వాలు రిజ‌ర్వేష‌న్‌ను అమ‌లు చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వాలు నిర్దిష్ట‌మైన విధానంలో రిజ‌ర్వేష‌న్ ఇస్తున్నాయి. అయితే.. ఓబీసీ విష‌యంలో మాత్రం కొంత గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. ముఖ్యంగా ఓబీసీలోనూ క్రీమీలేయ‌ర్ రిజ‌ర్వేష‌న్ వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా దుమారం రేపింది. కోట్ల మంది ఉద్యోగులు, ఉద్యోగాలు పొదాల‌ని కోరుకునే వారికి క్రీమీలేయ‌ర్ విష‌యం పంటికింద రాయిగా మారింది. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.

అస‌లేంటిది?

ఓబీసీ రిజ‌ర్వేష‌న్ అంటే.. బీసీల్లోనే మ‌రో వ‌ర్గం. అంటే ఇత‌ర వెనుక బ‌డిన వ‌ర్గాలు. వీరికి కూడా రిజ‌ర్వేష‌న్ ఇస్తూ.. 1993లోనే కేంద్ర‌ ప్ర‌భుత్వం చ‌ట్టం చేసింది. దీనిలో రెండు ప్రాతిప‌దిక‌లు ఉన్నాయి. ఒక‌టి నేరుగా ఓబీసీ రిజ‌ర్వేష‌న్ కింద అభ్య‌ర్థుల‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డం. 2) క్రీమీలేయ‌ర్‌. అంటే.. ఓబీసీగా న‌మోదైన అభ్య‌ర్థి కుటుంబ చ‌రిత్ర‌, వారి ఆదాయం, ఆస్తులు, ఖ‌ర్చుల‌ను కూడా చూసి రిజ‌ర్వేష‌న్ వ‌ర్తింప చేయ‌డం. ఇదే.. ఇప్పుడు వివాదంగా మారింది. తమిళ‌నాడుకు చెందిన కొంద‌రు ఉద్యోగుల‌కు.. ప్ర‌భుత్వాలు ఓబీసీ క్రీమీలేయ‌ర్ ప్రాతిప‌దిక‌న ఉద్యోగాలు నిరాక‌రించాయి. దీంతో వారంతా మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు.

విచార‌ణ జ‌రిపిన కోర్టు.. ఓబీసీ క్రీమీలేయ‌ర్ రిజ‌ర్వేష‌న్‌పై తీర్పు ఇచ్చింది. దీని ప్ర‌కారం.. ఓబీసీ క్రీమీలేయ‌ర్ రిజ‌ర్వేష‌న్లో స‌ద‌రు అభ్య‌ర్థి త‌ల్లిదండ్రుల ఆదాయం వారిద్ద‌రూ ఉద్యోగులు అయితే..వారి స్థాయి, అలానే ఆస్తుల‌ను కూడా గ‌ణించి.. ఈ రిజ‌ర్వేష‌న్‌ను గ‌తం నుంచే వ‌ర్తింప చేయాల‌ని తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్ప‌టికే ఉద్యోగాలు పొందిన వారు కూడా అన‌ర్హులు అయ్యే ప్ర‌మాదం ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ఉద్యోగులంతా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. గ‌తం నుంచి తీర్పు అమ‌లు చేయాల్సినఅవ‌స‌రం లేద‌ని ఈ ఏడాది మార్చి 11 నుంచి అమ‌లు చేయాల‌ని తేల్చి చెప్పింది.

అదేస‌మ‌యంలో ఇప్ప‌టికే నియామ‌కాలు పూర్త‌యిన, పోస్టులు కూడా కేటాయించిన వాటికి ఈ తీర్పు వ‌ర్తించ‌ద‌ని చెప్పింది. ఇక‌, కీల‌క‌మైన అంశం ఏంటంటే.. సుప్రీంకోర్టు తీర్పులో.. ఉద్యోగాలు పొందాల‌ని కోరుకునే.. క్రీమీలేయ‌ర్ అభ్య‌ర్థుల త‌ల్లిదండ్రుల వేత‌నాల‌తో పాటు.. వారి ఉద్యోగాల స్థాయి.. వారి ఆస్తులు.. వంటివాటిని పూర్తిగా ప‌రిశీలించాల‌ని స్ప‌ష్టం చేసింది. ఎలా ప‌డితే అలా క్రీమీలేయ‌ర్ వ‌ర్తింప చేసేందుకు నిరాక‌రించింది. త‌ద్వారా.. ఓబీసీ క్రీమీలేయ‌ర్ రిజ‌ర్వేష‌న్ విష‌యంలో అభ్య‌ర్థి తాలూకు కుటుంబ ప‌రిస్థితి, ఆర్థిక ప‌రిస్థితిని ఖ‌చ్చితంగా అంచనా వేసి.. అందులో ఎవ‌రు వెనుక‌బ‌డి ఉంటే వారికి మాత్ర‌మే అవ‌కాశం ద‌క్క‌నుంది. అంటే.. ఒక‌ర‌కంగా ఓబీసీ క్రీమీలేయ‌ర్ రిజ‌ర్వేష‌న్‌లో జాబ్ కొట్ట‌డం అంత ఈజీ కాద‌న్న‌ది స్ప‌ష్ట‌మైంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags:    
  • obcreservation 
  • obccreamylayer 
  • supremecourt 
  • reservationrules 
  • governmentjobs 

Similar News

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

పవన్ విడాకులు.. అసలు చట్టం ఏం చెబుతోంది!

2026-11-10 12:51 GMT

అరెస్ట్ అయితే చాలు.. ఇక 'ఉద్యోగానికి' సెలవు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పుతో అవినీతి తిమింగలాలకు వణుకు

2026-11-10 06:00 GMT

భర్త మహాశయులారా? భార్యకు భరణం ఎగ్గొట్టే ప్లాన్ చేయకండి.. ఇలా బుక్కవుతారు..

2026-11-07 02:19 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

మియాపూర్‌లో రూ. వేల కోట్ల భూములకు రక్షణ.. 23 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు తెర!

2026-10-30 04:01 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

11 వేల ఇంజెక్షన్ లక్షా 30 వేలా...కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు !

2026-10-28 03:36 GMT

Copyright @2026

Powered by Blink CMS