• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Anantapuramu >  రాప్తాడు బాలిక ఆరోగ్యంలో...

రాప్తాడు బాలిక ఆరోగ్యంలో కీలక మార్పు.. ప్రాణాపాయం దాటినట్లే!

| రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని ఆరోగ్యం మెరుగుపడుతోంది. బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను వైద్యులు ప్రత్యేక వార్డు నుంచి సాధారణ వార్డుకు మార్చారు. ఎడమ చేతి పట్టీ తొలగించడంతో కదిలించగలుగుతోంది. మరోవైపు, పోలీసుల కాల్పుల్లో కుడికాలు కోల్పోయిన నిందితుడు హేమంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

By - Tupaki Political Desk
Update: 2026-11-10 09:39 GMT

రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతోంది. గత నెల 31న బాలికపై ఉన్మాది దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో బాలిక చికిత్స పొందుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో చిన్నారికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. ప్రతి రోజూ ఆమె ఆరోగ్య విషయమై మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్ తెలుసుకుంటున్నారు. మంత్రి లోకేశ్ ప్రతిరోజు చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఎక్స్ వేదికగా ప్రకటన చేస్తున్నారు. మంగళవారం చిన్నారి ఆరోగ్యం కుదుటపడిందని ప్రత్యేక వార్డు నుంచి సాధారణ వార్డుకు తరలించినట్లు ఇద్దరు మంత్రులు తెలిపారు.

ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికకు తల, మెడ, ముఖం, చేతులు, వీపుపై గాయాలు అయ్యాయి. వీటికి సోమవారం కట్లు మార్చారు. చికిత్సను తట్టుకున్న బాలిక వేగంగా కోలుకుంటోందని వైద్యులు స్పష్టం చేశారు. ఆమె ఎడమ చేతికి పట్టీ తొలగించారు. దీంతో చేతిని కదిలించుకునేందుకు వీలు కలిగిందని చెబుతున్నారు. దగ్గినప్పుడు ఛాతీలో నొప్పి వస్తోందని బాలిక చెబుతోందని దీనికి చికిత్స అందిస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇక నోటి ద్వారా ఆహారం తక్కువగా తీసుకుంటుండటం వల్ల ముక్కు ద్వారా గొట్టంతో ఆహారం అందజేస్తున్నారు.

బాలిక మరింత వేగంగా కోలుకోడానికి నోటి ద్వారా ఆహారం తీసుకునేలా వైద్యులు ప్రోత్సహిస్తున్నారు. మణి పాల్ ఆస్పత్రి డాక్టర్‌ భాస్కర్‌ షెనాయ్‌ పర్యవేక్షణలో ప్లాస్టిక్‌ సర్జరీ, ఆర్థోపెడిక్ వైద్యుల సమన్వయంతో బాలికకు చికిత్స చేయిస్తున్నారు. ఉన్మాది దాడిలో గాయపడిన బాలిక ప్రాణాపాయం నుంచి బయటపడటంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సత్వర వైద్యం అందడంతో బాలిక వేగంగా కోలుకుంటోందని చెబుతున్నారు. మరోవైపు చిన్నారిపై దాడి చేసిన నిందితుడు హేమంత్ కుంటివాడు అయ్యాడు.

నిందితుడు కూడా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దాడి అనంతరం పరారైన నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ సమయంలో పోలీసు తూటాలు నిందితుడి కాళ్లలో నరాలను చిద్రం చేశాయి. దీంతో అతడి కుడికాలిని తొడ భాగం నుంచి తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం నిందితుడు కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. పూర్తిగా కోలుకున్నాక అతడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచి జైలుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.

Tags:    
  • rapthadu 
  • andhrapradesh 
  • naralokesh 
  • satyakumaryadav 
  • manipalhospital 

Similar News

చంద్ర‌బాబుకు బిగ్ టెస్ట్ పెట్టేసిన అనంత త‌మ్ముళ్లు..!

2026-11-15 20:49 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

అనంతపురం వైసీపీ మేయర్.. కూటమి పక్కా ప్లానింగ్, ఆ ఒక్కరినీ లాగేస్తారా?!

2026-11-10 14:13 GMT

అనంతపురంలో మేయర్ రచ్చ : టీడీపీ ఎమ్మెల్యేలకు అనంత వెంకటరామిరెడ్డి బిగ్ సవాల్

2026-11-10 09:27 GMT

ఆ ఓటు మీ ఇష్టం.. ఇదే కూట‌మికి శాప‌మైందా.. ?

2026-11-10 01:30 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

రంపంతో నరికాడు...తూటాతో కూలాడు !

2026-11-02 03:46 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

తరగతి గదిలోనే రాక్షసత్వం : పదోతరగతి విద్యార్థినిపై పాశవిక దాడి

2026-10-31 08:16 GMT

వైసీపీ సీపీఐ చెట్టాపట్టాల్...అనంతలో బిగ్ ట్విస్ట్

2026-10-31 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS