• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Anantapuramu >  ఆ ఓటు మీ ఇష్టం.. ఇదే...

ఆ ఓటు మీ ఇష్టం.. ఇదే కూట‌మికి శాప‌మైందా.. ?

| అనంతపురం కార్పొరేషన్‌లో డివిజన్ల పరంగా కూటమికి 37 స్థానాలు వచ్చినా, మేయర్ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి రమేష్ గౌడ్ 5,981 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఫలితంపై టీడీపీ అధినేత చంద్రబాబు నివేదిక కోరారు. కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం, క్రాస్ ఓటింగ్ కారణాలపై చర్చ జరుగుతోంది.

By - Garuda Media
Update: 2026-11-10 01:30 GMT

రాష్ట్రంలోని 13 మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌ల‌లో 12 చోట్ల కూట‌మి పార్టీలు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు విజ‌యం ద‌క్కిం చుకున్నాయి. వీటిలోనూ మెజారిటీ స్థానాల‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంది. విజ‌య‌వాడ, ఏలూరులో జ‌న‌సేన గెలి చింది. అయితే.. ఇన్ని సీట్లు గెలుచుకున్నా.. త‌మ‌కు కంచుకోట వంటి అనంత‌పురంలో వైసీపీ గెలుపు గుర్రం ఎక్క డం స‌హ‌జంగానే సైకిల్ పార్టీని ఇర‌కాటంలో ప‌డేసింది. దీంతో ఇప్పుడు అంత‌ర్మ‌థ‌నం చేప‌ట్టింది. ఇప్ప‌టికే నివేదిక కూడా చంద్ర‌బాబు చేరినా.. మ‌రింత అధ్య‌య‌నం చేయాల‌ని ఆదేశించారు. ముఖ్యంగా కార్పొరేట‌ర్ అభ్య‌ర్థులు వ్య‌వ‌హ‌రించిన తీరుపై టీడీపీ అధినేత ఆగ్ర‌హంతో ఉన్నార‌ని అంటున్నారు. వార్డు ఓటు త‌మ‌కే వేయాల‌ని.. మేయ‌ర్ ఓటు మీ ఇష్ట‌మ‌ని చేసిన ప్ర‌చారం ఇబ్బందికి దారితీసింద‌ని భావిస్తున్నారు.

వాస్త‌వం ఏంటి..?

అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రమేష్ గౌడ్ తొలిసారి రాజ‌కీయ అరంగేట్రం చేశారు. ఈయ‌న త‌న‌ బీజేపీ ప్ర‌త్య‌ర్థి అజీశ్ బాబుపై 5,981 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ప‌రిణామ‌మే కూట‌మిలో చర్చ‌కు దారితీసింది. వాస్త‌వానికి అనంత కార్పొరేష‌న్ వైసీపీ ద‌క్కించుకున్నా.. డివిజన్లలో మాత్రం కూటమిదే పైచేయిగా ఉంది. మొత్తం 62 డివిజన్లు ఉన్న అనంతపురం కార్పొరేషన్‌లో టీడీపీ (30), జనసేన (6), బీజేపీ (1) కూటమి అభ్యర్థులు కలిపి మొత్తం 37 స్థానాలను గెలుచుకున్నారు.

వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థులు కేవలం 21 డివిజన్లలో మాత్రమే విజయం సాధించారు. అయిన‌ప్ప‌టికీ.. మేయర్ పదవిలో వైఎస్సార్‌సీపీ విజయం ద‌క్కించుకోవ‌డం స‌హ‌జంగానే కూట‌మి పార్టీల‌ను అంత‌ర్మ‌థ‌నంలో ప‌డేసింది. ఇదిఎలా సాధ్య‌మైంద‌న్న‌దే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. కార్పొరేటర్ స్థానాల్లో కూటమికి మెజారిటీ వచ్చినప్పటికీ, మేయర్ పదవికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం ప్రజలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైపు మొగ్గు చూపారు. ఇక్క‌డే క్రాస్ ఓటింగ్ జ‌రిగింద‌ని గుర్తించారు.

వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు 62,219 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి అజీశ్ బాబుకు 56,238 ఓట్లు వచ్చాయి. కార్పొరేటర్లుగా కూటమికి ఓటు వేసిన ఓటర్లలో కొందరు మేయర్ ఎన్నిక వచ్చేసరికి వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఓటు వేశారని స్ప‌ష్ట‌మైంది.దీనికి ప్ర‌ధాన కార‌ణం.. కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం, ఓట్ల బదిలీ సరిగా జరగకపోవడం వల్లే బీజేపీ అభ్యర్థి ఓడిపోయారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడిచింది. పైగా.. చాలా మంది కార్పొరేట‌ర్ అభ్య‌ర్థులు.. తాము గెలిస్తే చాల‌న్న ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించార‌న్న మీడియా వార్త‌లు కూడా కూట‌మిని ఇర‌కాటంలోకి నెట్టాయి. ఇప్పుడు దీనిపైనే అంత‌ర్మ‌థ‌నం చేస్తున్నారు. కార‌ణాలు ఏవైనా కూడా.. అనంత‌పురంలో వైసీపీ ఎలా గెలిచింది? అనేదే ఇప్పుడు కూట‌మిలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    
  • anantapur 
  • andhrapradeshpolitics 
  • tdp 
  • ysrcp 
  • janasena 
  • bjp 

Similar News

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

అనంతపురం వైసీపీ మేయర్.. కూటమి పక్కా ప్లానింగ్, ఆ ఒక్కరినీ లాగేస్తారా?!

2026-11-10 14:13 GMT

రాప్తాడు బాలిక ఆరోగ్యంలో కీలక మార్పు.. ప్రాణాపాయం దాటినట్లే!

2026-11-10 09:39 GMT

అనంతపురంలో మేయర్ రచ్చ : టీడీపీ ఎమ్మెల్యేలకు అనంత వెంకటరామిరెడ్డి బిగ్ సవాల్

2026-11-10 09:27 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

రంపంతో నరికాడు...తూటాతో కూలాడు !

2026-11-02 03:46 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

తరగతి గదిలోనే రాక్షసత్వం : పదోతరగతి విద్యార్థినిపై పాశవిక దాడి

2026-10-31 08:16 GMT

వైసీపీ సీపీఐ చెట్టాపట్టాల్...అనంతలో బిగ్ ట్విస్ట్

2026-10-31 00:30 GMT

కొత్త పాలిటిక్స్‌: ప‌రిచ‌యాలు పెంచుతున్నారు.. !

2026-09-30 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS