అటు పవన్.. ఇటు చంద్రబాబు.. ఒకే సారి...!
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు సోమవారం ఒకే రోజు.. ఒకే సమయంలో తమ తమ సొంత నియోజకవర్గాల్లో పర్యటించడం రాజకీయంగా ఆసక్తి రేపింది.
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు సోమవారం ఒకే రోజు.. ఒకే సమయంలో తమ తమ సొంత నియోజకవర్గాల్లో పర్యటించడం రాజకీయంగా ఆసక్తి రేపింది. సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఇద్దరూ తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను.. ప్రారంభిస్తారు. అలానే పార్టీ నాయకులతోనూ భేటీ కానున్నారు. చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పలో పర్యటిస్తుండగా.. పవన్ కల్యాణ్ తన సొంత ఇలాకా.. పిఠాపురానికి వెళ్లారు.
ఎందుకు ప్రాధాన్యం?
ఒకేసారి ఇలా.. సీఎం, డిప్యూటీ సీఎంలు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించడానికి ప్రాధాన్యం ఏంటనేది ప్రశ్న. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయం రాజుకుంది. ఈ నేపథ్యంలో ముందుగా తమ తమ సొంత నియోజకవర్గాల్లో పర్యటించడం ద్వారా.. రాజకీయ పరిణామాలను అంచనా వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలానే.. తమ నియోజకవర్గాల్లో అసంతృప్తులను తెలుసుకుని సరిచేసుకునేందుకు ఛాన్స్ లభిస్తుం ది. ఇది ప్రధాన కారణం.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటికి మరింత ఊపు తెచ్చేందుకు.. కూడా ఈ పర్యటనలు అవకాశం కల్పించనున్నాయి. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం ద్వారా.. తాము చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అదేసమయంలో కుప్పం రాజకీయాలపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక, పిఠాపురంలో పవన్ కల్యాణ్ కూడా భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇలా.. ఇరువురు నాయకులు ముందుగా తమ తమ నియోజకవర్గాల్లో పరిస్థితులను అంచనా వేస్తారు.
వైసీపీకి చెక్!
త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీకి చెక్ పెట్టాలన్నది కూటమి పార్టీల నిర్ణయం ఈ నేపథ్యంలోనే చంద్రాబు, పవన్ కల్యాణ్.. తొలుత తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఏదేమైనా.. ప్రస్తుతం ఇద్దరు నాయకులు ఒకేసారి .. ఒకే సమయంలో తమ సొంత నియోజక వర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, కొత్త వాటిని ప్రారంభించడం వంటివి ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీలకు కూడా మేలు చేస్తుందని అంటున్నారు.