• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వందేళ్లకు కానీ మనకు చేసిన...

వందేళ్లకు కానీ మనకు చేసిన పాపం తెల్లోళ్లకు అర్థం కాలేదు

By - Tupaki Desk
Update: 2019-04-12 08:53 GMT
చేసిన పాపం ఉత్తనే పోదు. అహంభావానికి నిదర్శనంగా.. తెల్లోళ్ల దుర్మార్గాలకు ఉదాహరణగా నిలుస్తుంది జలియన్ వాలా బాగ్. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఒకచోట సమావేశమైన వారిపై అమానుషంగా కాల్పులు జరిపి తెల్లోళ్ల రికార్డుల ప్రకారం 400 మందిని హత్య చేసిన బ్రిటీషర్ల పైశాచికత్వానికి  నిలువెత్తు రూపంగా.. నిలుస్తుంది జలియన్ వాలా బాగ్ ఉదంతం.

భారత దేశ రికార్డుల ప్రకారం ఈ ఊచకోతలో వెయ్యిమందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయినట్లుగా చెబుతారు. ఈ దుర్మార్గానికి వందేళ్లు గడిచిన వేళ.. నాడు జరిగిన ఊచకోతకు నేడు విచారం వ్యక్తం చేశారు బ్రిటన్ ప్రధాని థెరిసా మే.

ఏప్రిల్ 13 నాటికి జలియన్ వాలా బాగ్ దురాగతం చోటు చేసుకొని వందేళ్లు కానున్న నేపథ్యంలో.. బ్రిటన్ ప్రధాని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పార్లమెంటులో మాట్లాడిన థెరిసా.. జలియన్ వాలా బాగ్ ఉదంతంపై విచారం వ్యక్తం చేశారు. బ్రిటిష్.. ఇండియన్ చరిత్రలో ఇదో మాయని మచ్చగా ఆమె అభిప్రాయపడ్డారు.

అయితే.. ఈ ఉదంతంపై పూర్తిస్థాయి క్షమాపణ మాత్రం ఆమె మాటల్లో వినిపించకపోవటాన్ని చూస్తే.. తెల్లోళ్ల అహంకారం ఇంకా తగ్గలేదని చెప్పక తప్పదు. ప్రధాని థెరిసా ప్రసంగిస్తున్న వేళ.. విపక్ష లేబర్ పార్టీ నేత జెరెమై కార్బెన్ జోక్యం చేసుకుంటూ ఈ ఘటనపై విస్పష్ట క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా.. థెరిసా మాత్రం ఆయన వినతికి సానుకూలంగా స్పందించలేదు.

ఇదిలా ఉంటే.. బ్రిటిష్ పాలకుల ఊచకోతకు బలైన వందలాది అమరవీరుల స్మృత్యర్థం పలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే బ్రిటన్ ప్రధాని ఈ ఉదంతంపై విచారం వ్యక్తం చేయటం గమనార్హం. దుర్మార్గ ఘటనకు పాల్పడిన వందేళ్లకు విచారం వ్యక్తం చేస్తున్న తెల్లోళ్లు.. మరో వందేళ్లకు క్షమాపణలు చెబుతారేమో?  నాగరిక సమాజంలోనూ చేసిన తప్పునకు గట్టిగా చెంపలేసుకుంటే వచ్చే నష్టమేందో?  అంత అహంకారం ఏందుకో?


Tags:    
  • Theresa may 
  • Jalian wala Bhag Issue 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS