ప్రపంచంలో బీసీసీఐకి తిరుగులేదు ...ఆదాయం ఎన్ని వందల కోట్లంటే !
భారత క్రికెట్ నియంత్రణ మండలి పంట పడింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్న బోర్డుకు గతేడాది ఆదాయం బిగ్ రీలీఫ్ ను ఇచ్చింది. ఆదాయంలో తనకు ఏ బోర్డు కూడా సాటిలేదని నిరూపించుకుంది. క్రికెట్ ప్రపంచంలోనే సంపన్న బోర్డుగా ఉన్న బీసీసీఐ తాజాగా ప్రకటించిన ఆదాయం చూస్తే షాక్ అవాల్సిందే.
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్‌ని తాజాగా బీసీసీఐ విడుదల చేసింది. ఆ నివేదికను పరిశీలిస్తే బోర్డు నికర విలువ రూ. 14,489.80 కోట్లుగా ఉంది. 2014-15తో పోలిస్తే ఊహించని విధంగా ఆదాయం పెరిగిపోయింది. అప్పుడు బీసీసీఐ నికర విలువ కేవలం 5,438.61 కోట్లు మాత్రమే. ఐపీఎల్ లాంటి బిగ్ టోర్నీలతో పాటు దేశవాళీ ఈవెంట్స్ తో కూడా బీసీసీఐకి భారీగా ఆదాయం సమాకూరుతుంది. 2018లో బీసీసీఐ ఆదాయం రూ. 4,017.11 కోట్లు రాగా.. దానిలో ఐపీఎల్ వాటా రూ. 2,407.46 కోట్లు కాగా.. దేశవాళీ క్రికెట్ టోర్నీలు ద్వారా రూ.446 కోట్లు వచ్చాయి.
ఇలా బీసీసీఐ బోర్డుకు పట్టిందల్లా బంగారం అవుతుంది. దీంతో ప్రపంచ క్రికెట్ బోర్డులలో రారాజుగా నిలుస్తుంది. కను సైగతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ని శాసించే స్ధాయికి చేరింది. ఇలా బీసీసీఐ చెప్పిందే వేదంగా మారుతుంది. చిన్న క్రికెట్ బోర్డులకు బీసీసీఐ వందల రూ. వందల కోట్లలో సాయం చేస్తూ యావాతు క్రికెట్ ను తన గుప్పిట్లో పెట్టుకుంది. అయితే 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ని మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు.