జనవరి 1 నుంచి మారే కీలక అంశాలివే.. మిస్ కావొద్దు

ఈ ఏడాది చివరి రోజైన డిసెంబరు 31తో ఏడో వేతన కమిషన్ గడువు ముగియనుంది. ఎనిమిదో వేతన కమిషన్ జనవరి ఒకటి నుంచి ప్రారంభం కానుంది.;

Update: 2025-12-30 09:30 GMT

మరో రెండు రోజులు. ఈ రోజు.. రేపు తర్వాత కొత్త క్యాలెండర్ వచ్చేస్తుంది. జీవితంలో 2025 గతమై.. 2026 వర్తమానం కానుంది. కొత్త క్యాలెండర్ వస్తున్న వేళ.. మన జీవితాల్లోనూ కొత్త మార్పులకు శ్రీకారం చుట్టేలా కొన్ని నిర్ణయాల్ని అమలు చేయనుంది ప్రభుత్వం. వీటి గురించి తెలుసుకోవటం చాలా అవసరం. నిత్యం అవసరమయ్యే విషయాలకు సంబంధించి కొత్త ఏడాది మొదటి రోజు నుంచి ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పుల్ని చూస్తే..

- మనిషి జీవితంలో రైలు ప్రయాణానికి ఉండే ప్రాధాన్యత.. ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ట్రైన్ జర్నీలకు సంబంధించిన కొత్త టైంటేబుల్ కొత్త ఏడాది మొదటి రోజు నుంచి అమల్లోకి రానుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లతో పాటు మొత్తం పాతిక రైళ్ల టైం మారనుంది. సో.. కొత్త ఏడాది నుంచి మీరు ఎక్కే ట్రైన్ కు సంబంధించిన టైంటేబుల్ ఏమైనా మారిందా? అన్నది ఒక్కసారి చెక్ చేసుకోవటం మర్చిపోవద్దు.

- ఈ ఏడాది చివరి రోజైన డిసెంబరు 31తో ఏడో వేతన కమిషన్ గడువు ముగియనుంది. ఎనిమిదో వేతన కమిషన్ జనవరి ఒకటి నుంచి ప్రారంభం కానుంది. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వేతన పెంపు నిర్ణయాలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు.. పెన్షనర్లకు కొంత్త ఊరట కలగటం ఖాయం.

- కొత్త ఏడాది మొదటి రోజు నుంచే ధరా భారం షురూ కానుంది. జనవరి ఒకటి నుంచి పలు కార్లు.. బైక్ కంపెనీలు తమ ధరల్ని పెంచనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. దీంతో.. కొత్తగా కారు.. బైక్ కొనే వారి మీద ధరలు పెరగనున్నాయి. ఈ ధరా భారం గరిష్ఠంగా 5 శాతం వరకు ఉండే అవకాశం ఉంది.

- అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు తగ్గిన నేపథ్యంలో కొత్త సంవత్సరంలో ఎల్ పీజీ.. కమర్షియల్ గ్యాస్.. ఏటీఎఫ్ ధరలు తగ్గే వీలుంది.

- ఆదాయపన్నుకు సంబంధించిన కొత్త ఐటీ రిటర్నులు కొత్త సంవత్సరం నుంచి మారనున్నాయి.కొత్త ఏడాది నుంచి ఐటీ ఫారాలు మారనున్నాయి.

- బ్యాంక్ లోన్ దగ్గర నుంచి పలు ఆర్థిక అంశాలకు సంబంధించి మీ వ్యక్తిగత క్రెడిట్ స్కోర్ (అదేనండి సిబిల్) అన్నది అత్యంత కీలకమన్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం తొలి రోజు నుంచి ఈ సిబిల్ స్కోర్ కు సంబంధించి ఇప్పటివరకు పదిహేను రోజులకోసారి అప్డేట్ అయ్యే దానికి భిన్నంగా ప్రతి వారం అప్డేట్ కానుంది. దీంతో.. రుణ అర్హతకు సంబంధించిన మంచి చెడ్డలు ఏవైనా.. ప్రతి వారం అప్డేట్ కానున్నాయి.

- రైల్వే రిజర్వేషన్ కోసం ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లోకి వెళ్లటం.. అందులో చేసుకోవటం తెలిసిందే. ఇందులో రిజర్వేషన్ చేసుకోవటానికి మొన్నటి వరకు ఎవరైనా.. ఎప్పుడైనా చేసుకోవచ్చు. గడిచిన కొంతకాలంగా తత్కాల్ రిజర్వేషన్ సమయంలో తప్పనిసరిగా ఆధార్ లింక్ అయితేనే.. రిజర్వేషన్ చేసుకునే మార్పు తెచ్చిన సంగతి తెలిసిందే. కొత్త ఏడాదిలో ఇది మరింత విస్త్రతం కానుంది. జనవరి ఐదునుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య కాలంలో రిజర్వేషన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ తో అకౌంట్ ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే జనవరి 12 నుంచి ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు రిజర్వేషన్ చేసుకోవటానికి ఆధార్ లింక్ చేసుకోవటం తప్పనిసరి. అలా లింక్ చేసుకున్న వారు మాత్రమే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

సో.. మీ ఐఆర్ సీటీసీ అకౌంట్ ను ఆధార్ తో లింక్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు.

- సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి పదహారేళ్ల లోపు పిల్లలపై ఆంక్షలు రానున్నాయి.

- బ్యాంక్ ఖాతాలకు సంబంధించి పాన్.. ఆధార్ రెండు లింక్ కాకుంటే బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఎవరైనా.. ఈ రెండింటిని లింక్ చేసుకోకుంటే తక్షణం చేసుకోవటం చాలా అవసరం.

- డిజిటల్ మోసాలకు చెక్ చెప్పేందుకు యూపీఐ చెల్లింపులు.. సిమ్ కార్డుల వెరిఫికేషన్ రూల్స్ మరింత కఠినం కానున్నాయి.

Tags:    

Similar News