తెలంగాణలో తొలి ఉరిశిక్ష .. ఏంటా కేసు.. పూర్వాపరాలు ఇవీ

మన దేశంలో ఎన్నో ఉరిశిక్షలు పడ్డాయి. చాలామందిని ఉరి తీశారు కూడా.. కానీ తెలంగాణ వచ్చాక ఇప్పటివరకు ఒక్క ఊరిశిక్ష పడలేదు.;

Update: 2025-12-30 07:42 GMT

మన దేశంలో ఎన్నో ఉరిశిక్షలు పడ్డాయి. చాలామందిని ఉరి తీశారు కూడా.. కానీ తెలంగాణ వచ్చాక ఇప్పటివరకు ఒక్క ఊరిశిక్ష పడలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంచలన కేసులు ఎన్కౌంటర్లు చూసాం కానీ ఒక నేరస్తుడికి కూడా కోర్టు ద్వారా ఉరిశిక్ష పడలేదు. కానీ ఇప్పుడు అది తొలిసారి పడింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పుతో తెలంగాణలో తొలి ఉరిశిక్షకు అమలుకు సిద్ధమైంది.

అసలేం జరిగింది?

ఈ దారుణ ఘటన 2011 జూలై 18న సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన కరణ్ సింగ్ అనే వ్యక్తి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి ఇనుప సామాన్లు తయారు చేస్తూ జీవించేవాడు.. ఒకరోజు ఒక ఇంటికి సామాన్లు అమ్మే నేపంతో వెళ్లిన కరణ్ సింగ్ ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో ఆగ్రహానికి లోనైనా నిందితుడు తన వద్ద ఉన్న సుత్తితో ఆమె తలపై బలంగా కొట్టి అతి క్రూరంగా హత్య చేశాడు. అప్పట్లో ఈ ఘటన జంట నగరాల్లో పెద్ద సంచలనం సృష్టించింది.

సుధీర్ఘ విచారణ.. ఉరి శిక్ష తీర్పు..

పోలీసులు నిందితుడిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అప్పటినుండి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. సాక్షాధారాలను పరిశీలించిన మేడ్చల్ మల్కాజ్గిరి మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు కరణ్ సింగ్ ను దోషిగా నిర్ధారించింది.ఇతడికి ఉరిశిక్షతోపాటు పదివేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

చట్ట ప్రకారం జిల్లా కోర్టు విధించిన మరణశిక్ష నేరుగా అమలు కాదు దీనిపై కొన్ని కీలక దశలు ఉంటాయి భారత శిక్షాసృతి ప్రకారం ఏదైనా సెషన్ స్కూట్ మరణశిక్ష విధిస్తే దాని సంబంధిత హైకోర్టు తప్పనిసరిగా ధృవీకరించాలి. దోషి హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో ఆపిల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా శిక్షను ఖరారు చేస్తే రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే విధులు బాటు కూడా ఉంటుంది.

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మహిళలపై జరిగే అఘాయిత్యాలకు ఇటువంటి కఠినమైన శిక్షలు అవసరమని న్యాయ నిపణులు అభిప్రాయపడుతున్నారు. ఆలస్యమైన బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .

భారతదేశంలో ఉరిశిక్ష బ్రిటిష్ కాలం నుండి అమలులో ఉంది. స్వతంత్ర భారత రాజ్యాంగం ప్రకారం, న్యాయవ్యవస్థకు మరణశిక్ష విధించే అధికారం ఉంది. అయితే ఇది కేవలం అరుదైన వాటిలో అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే విధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చివరగా దేశంలో నిర్భయ దోషులు నలుగురికి ఉరిశిక్ష పడింది. అంతకుముందు ఉగ్రవాదులకు ఉరివేశారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు వందలాది మందికి ఉరిశిక్షలు అమలు చేయబడ్డాయి. ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన కొన్ని కేసుల్లో కూడా ఉరిపడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఉరిశిక్షను రద్దు చేశాయి. భారత్‌లో కూడా ఉరిశిక్షను రద్దు చేయాలని మానవ హక్కుల సంఘాలు కోరుతున్నప్పటికీ ఉగ్రవాదం , క్రూరమైన నేరాల దృష్ట్యా ఇది అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News