అతడి లైఫ్ ను మూవీగా తీస్తున్న వేళ.. ‘రియల్ హీరో’ చేస్తున్నది తెలిస్తే ఫిదా

ఒకరు తమ జీవితకాలంలో ఇలా కూడా చేయగలరా? అన్న సందేహం కలుగుతుంది వారి గురించి తెలిసినప్పుడు.;

Update: 2025-12-30 08:30 GMT

ఒకరు తమ జీవితకాలంలో ఇలా కూడా చేయగలరా? అన్న సందేహం కలుగుతుంది వారి గురించి తెలిసినప్పుడు. తమ జీవితాన్ని తమ కంటే కూడా సమాజం కోసం వెచ్చించే ఇలాంటోళ్లు అరుదుగా కనిపిస్తుంటారు. తమ వ్యక్తిగత స్వార్థం ఏమీ లేకుండా నిత్యం తమ చుట్టూ ఉన్న వారి కోసం తపించే ఇలాంటి వ్యక్తులు నిలువెత్తు స్ఫూర్తికి నిదర్శనంగా నిలవటమే కాదు.. ఇలాంటోళ్లు గుప్పెడు మంది ఉంటే చాలు.. వారి చుట్టూ ఉన్న సమాజం మారిపోతుందన్న భావన కలుగుతుంది. ఇదంతా పద్మశ్రీ అవార్డు గ్రహీత కరీముల్ హక్. ఎవరితను..? ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తాడు? ఇప్పుడు ఇతను ఎందుకు హాట్ టాపిక్ గా మారారు? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే..

పద్మశ్రీ కరీముల్ హక్ మామూలు వ్యక్తి కాదు. అతనో శక్తి. ఒక వ్యక్తి తనను తాను సమాజానికి సమర్పించుకోవాలని డిసైడ్ అయితే.. కచ్ఛితంగా అలాంటోళ్లంతా కరీముల్ హక్ గా మారతారు. ఇప్పుడు ఇతను ఎందుకు హాట్ టాపిక్ గా మారారంటే..ఇతడి జీవితకథను సినిమాగా తీస్తున్నారు. తొలుత ఈ సినిమాను హిందీలో తీయాలని భావించినా.. చివరకు బెంగాలీలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హక్ పాత్రను దేవ్ నటిస్తున్నారు.

1995లో అంబులెన్స్ సౌకర్యం లేని కారణంగా తన తల్లి జఫరున్నీసాకు సకాలంలో వైద్యం అందించలేని వేళ.. ఆమెను ఆసుపత్రికి తరలించే వేళలో ఆమె మరణించారు.అప్పటి నుంచి కరీముల్ మైండ్ సెట్ పూర్తిగా మారింది. తన వద్ద ఉన్న బైక్ ను అంబులెన్సుగా మార్చేశాడు. ఉచితంగా సేవలు అందిస్తున్నాడు. తన బైక్ ను అంబులెన్సుగా మార్చిన నేపథ్యంలో ఇప్పటివరకు 7వేల మంది ప్రాణాల్ని కాపాడాడు.

ఇతడి సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అదే సమయంలో అతడి జీవితాన్ని సినిమాగా తీద్దామని భావించారు. అందుకు తగ్గట్లే వినయ్ మౌద్గల్ కాంటాక్టు చేసుకున్నారు. ఇప్పుడా మూవీని బెంగాలీలో నిర్మిస్తున్నారు. తన జీవిత కథ ఆదారంగా నిర్మిస్తున్న సినిమాకు సంబంధించి అతడికి కొంత డబ్బును అందిస్తున్నారు నిర్మాతలు. ఆ డబ్బుతో ఆసుపత్రిని.. అనాథాశ్రమాన్నీ నిర్మించాలని ఆయన నిర్ణయం తీసుకోవటం పలువురిని కదిలిస్తోంది. ఒక వ్యక్తి సమాజం కోసం ఇంతలా తపించటం ఫిదా అయ్యేలా చేస్తోంది.

Tags:    

Similar News