రోల్స్ రాయిస్ 3వ హోమ్ మార్కెట్ గా భారత్... ఏపీకి ఛాన్స్..!

అవును... రోల్స్ రాయిస్ తమ కంపెనీ కోసం తయారీ యూనిట్ ను నిర్మించడానికి భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లు ప్రకటించడం ఆసక్తిగా మారింది.;

Update: 2025-12-30 10:16 GMT

బ్రిటిష్ ఆటోమొబైల్ దిగ్గజం రోల్స్ రాయిస్ భారత్ వైపు చూస్తోంది. ఇందులో భాగంగా.. జెట్ ఇంజన్లు, నావల్ ప్రొపల్షన్, ల్యాండ్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్‌ తో సహా వివిధ డొమైన్‌ లలో అవకాశాల పూర్తి సామర్థ్యాన్ని అన్‌ లాక్ చేసే ప్రణాళికకు అనుగుణంగా యూకే వెలుపల భారతదేశాన్ని తన మూడవ హోమ్ మార్కెట్ గా మార్చాలని చూస్తుంది. ఈ విషయాన్ని బ్రిటిష్ ఏరో ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తెలిపింది. ఈ సందర్భంగా శశి ముకుందన్ కీలక విషయాలు వెల్లడించారు.

అవును... రోల్స్ రాయిస్ తమ కంపెనీ కోసం తయారీ యూనిట్ ను నిర్మించడానికి భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లు ప్రకటించడం ఆసక్తిగా మారింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రోల్స్ రాయిస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శశి ముకుందన్.. భారత్ లో పెద్ద పెట్టుబడి పెట్టడం కోసం కంపెనీ ప్రణాళికలు వేస్తోందని.. నెక్స్ట్ జనరేషన్ ఏరో ఇంజిన్ ను భారత్ లో అభివృద్ధి చేయడం ప్రాధాన్యతగా పెట్టుకుందని పేర్కొంది.

ఇదే సమయంలో... భారత నావికాదళ పోరాట పరాక్రమాన్ని పెంపొందించడానికి భారత విద్యుత్ చోదక సామర్థ్యం అవసరాన్ని తీర్చడంలో రోల్స్ రాయిస్ ఎలా గణనీయంగా దోహదపడుతుందో ఈ సందర్భంగా ముకుందన్ హైలెట్ చేశారు. ఇందులో భాగంగా.. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌ క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ఇంజిన్ కోర్ ను నావల్ మెరైన్ ఇంజిన్ గా మర్చవచ్చని.. దీన్ని ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ కోసం కూడా ఉపయోగించవచ్చని ముకుందన్ తెలిపారు.

ఈ సందర్భంగా... ప్రపంచవ్యాప్తంగా ఏరో ఇంజిన్ ను మెరైన్ చేయగల సామర్థ్యం ఉన్న అతి కొద్ది కంపెనీల్లో రోల్స్ రాయిస్ ఒకటని పేర్కొన్నారు. అంతా అనుకూలంగా జరిగితే అది ఒక ముఖ్యమైన పెట్టుబడి అవుతుందని.. ప్రజలు దృష్టిని ఆకర్షించేటంత పెద్దగా ఉంటుందని.. అయితే ప్రస్తుతం ఆ పెట్టుబడి సంఖ్య ఎంత అనేది చెప్పదలచుకోవడం లేదని అన్నారు. ఈ క్రమంలో భారత్ లోని రెండు రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలతో కంపెనీ రెండు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంటుందని తెలిపారు!

కాగా... అక్టోబర్‌ లో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో స్పందించిన ముకుందన్... రోల్స్ రాయిస్ ముందుకు సాగడానికి భారతదేశం చాలా కీలకం కాబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలియజేశారు. తాము యూకే వెలుపల మరో రెండు స్వదేశీ మార్కెట్లను అభివృద్ధి చేశామని.. అందులో ఒకటి యూఎస్ కాగా మరొకటి జర్మనీ అని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ తదుపరి మార్కెట్ గా భారత్ ను మార్చుకోవాలని అనుకుంటున్నామని వెల్లడించారు.

ఏపీకి ఛాన్స్...!:

ఈ సందర్భంగా ఇప్పటికే కియా మోటార్స్ ఇండియాతో రాష్ట్రం సాధించిన విజయగాథ తరచూ చర్చనీయాంశంగా మారుతోన్న వేళ.. తాజా కూటమి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కీలక మార్పులు చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు స్థిరమైన నాయకత్వం వెరసి రోల్స్ రాయిస్ వంటి సంస్థ పెట్టుబడులకు ఏపీ స్వర్గదామంగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు! ఈ సమయంలో సంస్థ ప్రతినిధులతోనూ, కేంద్రంతోనూ ఏపీ సర్కార్ చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు!

Tags:    

Similar News