ఆశ్రమానికి ఆ రాష్ట్ర సీఎం.. ఫేస్ షీల్డ్ తో స్వాములోరు

Update: 2020-11-18 05:30 GMT
కొన్నిసార్లు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాదు కానీ.. అదే పనిగా చోటు చేసుకునే పరిణామాలు ఆసక్తికరంగానే కాదు.. ఆలోచనలో పడేలా సాగుతుంటాయి. అలాంటి సీనే ఒకటి.. తాజాగా చినజీయర్ స్వామీజీ ఆశ్రమంలో చోటు చేసుకుంటుందని చెప్పక తప్పదు. చినజీయర్ స్వామికున్న భక్త కోటిలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. ప్రముఖ వ్యాపార..పారిశ్రామికవేత్తలు ఉన్నారు.

ఇటీవల కాలంలో ఆ జాబితాలోకి చేరారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే.. మధ్యప్రదేశ్ సీఎం ఇటీవల కాలంలో జీయర్ స్వామి దర్శనం కోసం వస్తున్నారు. ఆ మధ్య ఆశ్రమానికి వచ్చిన ఆయన.. ఏకంగా రెండు రోజులు పాటు బస చేయటం.. ఆ  సందర్భంగా ఆశ్రమంలో బడా పారిశ్రామికవేత్తలు కూడా ఉండటం ఆసక్తికరంగా మారింది.

అయితే.. దీనికి సంబంధించిన వార్తులు మొయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. తాజాగా మరోసారి జీయర్ స్వామి వారి ఆశ్రమానికి మధ్యప్రదేశ్ సీఎం వచ్చిన సందర్భంగా.. సదరు పారిశ్రామికవేత్తలు మరోసారి కనిపించటం విశేషం. ఇదిలా ఉంటే.. కరోనా నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎంకు తీర్థ ప్రసాదాలు అందజేసే సమయంలో చినజీయర్ స్వామీజీ ముఖానికి ఫేస్ షీల్డ్ పెట్టుకున్నారు. చినజీయర్ స్వాములోరి ఆశ్రమానికి అదే పనిగా వస్తున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటనలపై పారిశ్రామికవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News