వాజ్ పేయికి ప్రపోజ్ చేసిన పాక్ మహిళ.. రిప్లై పీక్స్ అన్న రాజ్ నాథ్ సింగ్!

దేశవ్యాప్తంగా మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి 101వ జయంతిని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-12-25 17:30 GMT

దేశవ్యాప్తంగా మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి 101వ జయంతిని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ ప్రధాని వాక్ చాతుర్యాన్ని, సమస్పూర్తిని, విలక్షణమైన హాస్యాన్ని హైలెట్ చేసే అనేక సందర్భాలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేసుకొన్నారు. ఈ సందర్భంగా భారత్ తో పాటు పాకిస్థాన్ లోనూ ఎదురైన అనుభవాలు, వాటిని వాజ్ పేయి సమయస్పూర్తిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అవును... ప్రత్యర్థులపై గీత దాటకుండానే పదునైన మాటల తూటాలు నిసరడంతో పాటు అద్భుతమైన కవితలతోనూ ఎదుటివారిని మంత్రముగ్దుల్ని చేయడంలో దిట్ట అయిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ని అంతా "వాచస్పతి" అని కొడియాతరనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశమంతా ఆయన 101 జయంతిని జరుపుకుంటున్నాయి. ఈ సమయంలో ఆయన వాక్ చాతుర్యానికి సంబంధించిన పలు సంఘటనలను రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు.

వాజ్ పేయి పదవీకాలంలోని ముఖ్యమైన సంఘటనల్లో 1999 ఫిబ్రవరిలో జరిగిన ఆయన లాహోర్ బస్సు యాత్ర ఒకటి అని చెప్పొచ్చు. ఈ పర్యటన సందర్భంగా అణు పరీక్షల తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడం లక్ష్యంగా లాహోర్ డిక్లరేషన్ పై సంతకం చేశారు. ఈ క్రమంలో.. పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు.. ఆయన ప్రసంగాలకు ఒ మహిళ ఆకర్షితురాలైందని రాజ్ నాథ్ గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా వాజ్ పేయి దగ్గరకు వచ్చిన ఆ మహిళ... "నన్ను వివాహం చేసుకుంటారా? అందుకు బదులుగా కశ్మీర్ ను ఇస్తారా?" అని అడగ్గా... తనదైన శైలో స్పందించిన వాజ్ పేయి... "నిన్ను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.. కానీ, కట్నం కింద పాకిస్థాన్ కావాలి" అని అడిగారని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ రియాక్షన్ ఆయనలోని హాస్యాన్ని, సమయస్పూర్తినే కాకుండా.. కశ్మీర్ పై ఆయన దృఢమైన వైఖరిని ప్రతిబించించిందని తెలిపారు.

మరో సందర్భంలో... వాజ్ పేయి నిర్బంధంలో ఉన్నప్పుడు ఆయనకు తీవ్ర వెన్నునొప్పి వచ్చిందని.. ఆ సమయంలో ఆయనను ఎయిమ్స్ కు తరలించారని చెప్పిన రాజ్ నాథ్ సింగ్... అతను ఎక్కువగా వంగడం వల్ల వెన్నునొప్పి వచ్చిందా అని వైద్యులు అడిగారని.. దానికి స్పందిస్తూ వాజ్ పేయి.. "డాక్టర్ సాహిబ్, నాకు జీవితంలో ఎలా వంగాలో తెలియాదు.. బహుశా నేను ఎక్కడెక్కడో తిరిగి ఉండొచ్చు" అని సమాధానం చెప్పారని రాజ్ నాథ్ గుర్తుచేసుకున్నారు.

ఇదే క్రమంలో... 2006లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో జరిగిన ఒక సంఘటనను రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందులో భాగంగా... ఆ ఏడాది ఇరాక్ లో చమురు - ఆహారం ఒప్పందం వివాదంతో యూపీఏ కుదేలైందని.. దీంతో అప్పటి విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చిందని చెప్పిన రాజ్ నాథ్ సింగ్.. ఆ సమయంలో జర్నలిస్టులు వాజ్ పేయిని ప్రశ్నించారని అన్నారు.

ఇందులో భాగంగా... కాంగ్రెస్ ను కాపాడటం కోసమే నట్వర్ సింగ్ ను బలిపశువును చేశారా అని కొంతమంది జర్నలిస్టులు వాజ్ పేయిని ప్రశ్నించగా.. దానికి సమాధానంగా స్పందించిన ఆయన.. "నేను శాఖాహారిని" అని బదులిచ్చారని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇవి ఆయన సమయస్పూర్తికి, వాక్ చాతుర్యానికి, హాస్యానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలని తెలిపారు.

కాగా... జీవితంలో వివాహం చేసుకోకుండా ఉండిపోయిన మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి.. గ్వాలియర్ లోని విక్టోరియా కాలేజీలో తనతో కలిసి చదువుకున్న రాజ్ కుమారి కౌలు కుమార్తె నమితను దత్తత తీసుకున్నారు. ఇక ఆయన 93 ఏళ్ల వయసులో ఆగస్టు 16 - 2018లో మరణించగా.. ఆయన అంత్యక్రియలను నమిత నిర్వహించారు.

Tags:    

Similar News