కామ్య మార‌న్ పై హేట్ హీట్.. అత‌డు మాత్రం సింపుల్ కూల్..

స‌రిగ్గా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ముంగిట ఎందుకు జ‌రిగిందో కానీ.. సౌత్ ఆఫ్రికా లీగ్ ది హండ్రెడ్ లీగ్ వేలం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్ హెచ్) ఓన‌ర్ కావ్య మార‌న్ కు త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టింది.;

Update: 2026-03-18 17:30 GMT

స‌రిగ్గా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ముంగిట ఎందుకు జ‌రిగిందో కానీ.. సౌత్ ఆఫ్రికా లీగ్ ది హండ్రెడ్ లీగ్ వేలం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్ హెచ్) ఓన‌ర్ కావ్య మార‌న్ కు త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో... అదీ పొలిటిక‌ల్ గా త‌మిళ‌నాడులో ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా అక్క‌డి అధికార పార్టీ డీఎంకేతో సంబంధం ఉన్న స‌న్ టీవీ గ్రూప్ న‌కు చెందిన ఎస్ఆర్ హెచ్ యాజ‌మాన్యానికి మ‌రో రూపంలోనూ వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. ఇదంతా పాకిస్థాన్ ఓవ‌ర్ యాక్ష‌న్ ప్లేయ‌ర్ అబ్రార్ అహ్మ‌ద్ ను ది హండ్రెడ్ లీగ్ వేలంలో స‌న్ రైజ‌ర్స్ కొనుగోలు చేయ‌డంతోనే వ‌చ్చింది. అస‌లే గ‌త ఏడాది పెహ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌ర్వాత భార‌త్-పాక్ సంబంధాలు అత్యంత క‌నిష్ఠ స్థాయికి ప‌డిపోయాయి. ఇంత‌లోనే గ‌త సెప్టెంబ‌రులో జ‌రిగిన ఆసియాక‌ప్ లో పాక్ ఆట‌గాళ్ల‌కు షేక్ హ్యాండ్ లు ఇవ్వ‌క‌పోవ‌డం, ఆపై ఆ జ‌ట్టు మీద ఫైన‌ల్లో గెలిచాక టైటిల్ ను పాక్ బోర్డు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మ‌న్ అయిన మొహిసిన్ న‌ఖ్వీ ఎత్తుకుపోవ‌డంతో ర‌గ‌డ పెద్ద‌దైంది. తాజాగా టి20 ప్రపంచ క‌ప్ ముందు పాక్ ప‌న్నిన కుయుక్తులు అన్నీ ఇన్నీ కావు. బంగ్లాదేశ్ ను ముందుకు నెట్టి టోర్నీని బ‌హిష్క‌రించేలా చేసింది. ఆపై భార‌త్ తో శ్రీలంక‌లో జ‌రిగే మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తామ‌ని బీరాలు పోయింది. చివ‌ర‌కు తోక ముడిచింది. ఓడిపోయింది కూడా. ఇంత దారుణంగా ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన్న స‌మ‌యంలో అబ్రార్ ను తీసుకోవ‌డం స‌న్ రైజ‌ర్స్ కు బ్యాడ్ నేమ్ తెచ్చింది.

అది బ్ల‌డ్ మ‌నీ..

అబ్రార్ కు ది హండ్రెడ్ లీగ్ లో స‌న్ రైజ‌ర్స్ ఇచ్చే డ‌బ్బులో ప‌న్ను కింద కొంత పాక్ ప్ర‌భుత్వానికి వెళ్తుంద‌ని, అది చివ‌ర‌కు వారి సైన్యంపై పెడ‌తార‌ని, వారు మ‌న‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగుతార‌ని పేర్కొంటూ.. దానిని బ్ల‌డ్ మ‌నీ అని అభివ‌ర్ణించాడు క్రికెట్ దిగ్గ‌జం సునీల్ గావ‌స్క‌ర్. అయితే, అదేమీ ఐపీఎల్ కాదంటూ ది హండ్రెడ్ లీగ్ పై బీసీసీఐ స్పందించింది. కానీ, అంత‌టి గావ‌స్క‌ర్ తీవ్రంగా స్పందించాక‌.. ఇక చెప్పేదేముంది? ఈ నేప‌థ్యంలో కావ్య మార‌న్ నాయ‌క‌త్వంలోని స‌న్ రైజ‌ర్స్ కు సంక‌ట స్థితి ఏర్ప‌డింది. ఈ ప్ర‌భావం ఐపీఎల్ లో జ‌ట్టుపై ప‌డుతుందా? అనే ఆందోళ‌న కూడా వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇంత‌కూ అబ్రార్ ఏమంటాడు?

మొన్న‌టివ‌ర‌కు స‌న్ రైజ‌ర్స్ ఓన‌ర్ కావ్య మార‌న్ ను ఒక ఏంజెల్ లా చూసిన అభిమానులు.. ఈ ఏడాది ఎలా స్పందిస్తారో అన్న‌ది చ‌ర్చ‌నీయంగా మారింది. ఇంత‌కూ వివాదానికి మూల‌కార‌ణ‌మైన అబ్రార్ ఏం చేస్తున్నాడో తెలుసా? అత‌డు చాలా కూల్ గా ఉన్నాడ‌ట‌. పైగా టి20 ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న అత‌డు త‌న ప్రాక్టీస్ తాను చేసుకుంటూ పోతున్నాడ‌ట‌. తాజా ర‌గ‌డ త‌న‌పై ఏమాత్రం ప్ర‌భావం చూప‌డం లేద‌ని అంటున్నారు. మ‌రోవైపు మా వాడు టాప్ 3 బౌల‌ర్. అందుకే విదేశీ లీగ్ ల‌లో అత‌డికి డిమాండ్ అంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మురిసిపోతుంద‌ట‌. అంటే, ప‌రోక్షంగా త‌మ క్రికెట‌ర్ ప్ర‌తిభ‌తోనే తీసుకున్నారు త‌ప్ప‌.. మీరు గొప్ప ఏమీ లేద‌ని ప‌రోక్షంగా స‌న్ రైజ‌ర్స్ యాజ‌మాన్యానికి చుర‌కేసింద‌న్న‌మాట‌.

Tags:    

Similar News