ట్రాన్స్ క్రికెట‌ర్ అన‌య బంగ‌ర్ క్ర‌ష్ ఈ యంగ్ స్టార్ బ్యాట‌ర్‌పై!

అనయ బంగర్ కేవలం సోషల్ మీడియా విషయాలకే పరిమితం కాకుండా తన క్రికెట్ ప్రయాణాన్ని కూడా కొనసాగిస్తున్నారు.

Update: 2026-10-19 06:25 GMT

భారత మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అయిన అనయ బంగర్ ఇటీవలి కాలంలో ఒక ఫ‌న్నీ రాపిడ్-ఫైర్ ఇంటర్వ్యూ కారణంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యారు. క్రికెట్ ప్రపంచంలోని ప్రముఖులపై ఈ ట్రాన్స్ క్రికెట‌ర్ వ్యక్తపరిచిన భిన్నమైన అభిప్రాయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు దీనిపై పెద్దఎత్తున చర్చించుకుంటున్నారు.

ఈ ఇంటర్వ్యూలోని అత్యంత ఆకర్షణీయమైన అంశం భారతదేశం యువ క్రికెటర్లతో కూడిన `కిల్, మ్యారీ, హుక్ అప్` గేమ్. ఇందులో ఎలాంటి సంకోచం లేకుండా అభిషేక్ శర్మను వివాహం చేసుకుంటానని.. శుభ్మన్ గిల్‌తో హుక్ అప్ అవుతానని.. శ్రేయాస్ అయ్యర్‌ను `కిల్` చేస్తానని అన‌య బంగ‌ర్ సరదాగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా స్వచ్ఛమైన ప్రతిభ ఆధారంగా అభిషేక్ శర్మనే అత్యుత్తమ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అని ప్రశంసించారు.

ఈ రాపిడ్-ఫైర్ ప్రశ్నావళిలో దేశీయ - అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించిన ఇతర సరదా విషయాలు కూడా చర్చకు వచ్చాయి. తనకు ఎదురుగా బౌలింగ్ చేయడం ఏ బౌలర్‌కైనా సులభమా? అని ప్రశ్నించినప్పుడు.. ఆమె తన తండ్రి అయిన సంజయ్ బంగర్ పేరును సరదాగా పేర్కొంది. ఇక లెజెండరీ బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీ అంటేనే తనకు ఇష్టమని చెప్పడమే కాకుండా... భారత మహిళా జట్టులో షఫాలీ వర్మను ఔట్ చేయడం చాలా సులభమని వ్యాఖ్యానించింది.

అనయ బంగర్ కేవలం సోషల్ మీడియా విషయాలకే పరిమితం కాకుండా తన క్రికెట్ ప్రయాణాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరగనున్న కొత్త‌ సీజన్ కోసం సన్నద్ధమవుతున్న ఆమె.. సర్‌ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, మోయిన్ ఖాన్.. వారి తండ్రి నౌషాద్‌ల వద్ద శిక్షణ పొందే అవకాశం దక్కడంపై కృతజ్ఞతలు తెలిపారు. చిన్ననాటి నుంచి ముంబై మైదానాలలో కలిసి ఆడిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. మార్గాలు వేరైనా క్రికెట్ పై తమకున్న ప్రేమ ఎప్పటికీ మారనిది అని ఆమె పేర్కొన్నారు.

అనయ బంగర్ తన వ్యక్తిగత జీవితంలో ఒక సాహసోపేతమైన, కీలకమైన మార్పును ఎంచుకున్నారు. ఆమె పుట్టుకతో అబ్బాయి అయినా.. తన నిజమైన గుర్తింపును అన్వేషిస్తూ మ‌గాడి నుంచి స్త్రీగా (ట్రాన్స్‌జెండర్‌గా) రూపాంతరం చెందే ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. సమాజంలో ఎదురయ్యే విమర్శలను, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ.. తన ఆత్మగౌరవం- వ్యక్తిగత సంతోషం కోసం ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

అన‌య ప్ర‌స్తుతం టీమిండియాలో ఆడుతున్నారా?

అనయ బంగర్ పురుషుల క్రికెట్ టీమ్‌కు లేదా మహిళా జాతీయ జట్టుకు ఎంపిక అవ్వలేదు. ఆమె గతంలో పురుషుడిగా ఉన్నప్పుడు స్థానిక స్థాయిలో.. ముంబైలోని మైదానాల్లో పురుషుల క్లబ్ క్రికెట్ ఆడింది. అయితే జెండర్ ట్రాన్సిషన్ ప్రక్రియ (స్త్రీగా మారడం) పూర్తి చేసుకున్న తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)-భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిబంధనల ప్రకారం ట్రాన్స్‌జెండర్ మహిళలు మహిళల అంతర్జాతీయ లేదా అధికారిక క్రికెట్‌లో ఆడడంపై ఉన్న పరిమితుల కారణంగా ఆమె ప్రస్తుతం మహిళల టీమ్‌లో ఆడటం లేదు.

ఆస్ట్రేలియాలో రాబోయే సీజన్ -స్థానిక లీగ్స్ కోసం అన‌య‌ సన్నద్ధమవుతూ శిక్షణ పొందుతోంది. అయితే ఏ టీమ్ లో ఆడుతుంది? పురుషుల టీమ్ లేదా మ‌హిళ‌ల టీమ్? అని ప్ర‌శ్నిస్తే.. ఆమె స్వయంగా పేర్కొన్నట్లుగా సర్‌ఫరాజ్ ఖాన్ కుటుంబానికి చెందిన ముంబై క్రికెట్ సర్కిల్ లేదా ఇతర ప్రైవేట్ -స్థానిక ప్రాక్టీస్ సెషన్ల ద్వారా ఆస్ట్రేలియాలో కొన్ని లోకల్ క్లబ్స్ లేదా ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం శిక్షణ తీసుకుంటోంది. ఇది ప్రొఫెషనల్ లీగ్ లేదా జాతీయ జట్టు మ్యాచ్ కాకుండా.. కేవలం వ్యక్తిగత శిక్షణ మరియు స్థానిక ప్రాక్టీస్ కోసం మాత్రమే.



Tags:    

Similar News