సచిన్ పిల్లలు ఇంత సింపులా? ఈ విషయంలో అర్జున్‌ని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకైనప్పటికీ, అర్జున్ టెండూల్కర్ ఎప్పుడూ చాలా సాదాసీదా జీవితాన్నే గడపడానికి ఇష్టపడతారు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకైనప్పటికీ, అర్జున్ టెండూల్కర్ ఎప్పుడూ చాలా సాదాసీదా జీవితాన్నే గడపడానికి ఇష్టపడతారు. కోట్ల సంపన్న కుటుంబం నుండి వచ్చినా, మైదానం వెలుపల ఆయన ప్రవర్తన ఎంతో సాధారణంగా ఉంటుంది. తాజగా ఒక దుకాణం బయట సాధారణ టీ-షర్ట్ వేసుకుని, ఫోన్ చూస్తూ కూర్చున్న అర్జున్ ఫొటో నెట్టింట వైరల్ అయింది. సచిన్ కొడుకని ఎవరూ గుర్తుపట్టలేనంత సింపుల్‌గా ఆయన కనిపించారు. సోషల్ మీడియాలో నిత్యం వచ్చే ట్రోలింగ్స్‌ను, విమర్శలను ఆయన అసలు పట్టించుకోరు. ఆ విమర్శలు తనను ఏమాత్రం ప్రభావితం చేయవని చాలా కూల్‌గా తీసుకుంటారు. ఆ విశేషాలు చూద్దాం..
ఎలాంటి షార్ట్‌కట్స్ లేకుండా కష్టపడే తత్వం:
కోట్లకు అధిపతి అయిన సచిన్ కుమారుడైనప్పటికీ, అర్జున్ క్రికెట్లో ఎటువంటి షార్ట్‌కట్స్ ఎంచుకోలేదు. జట్టులో తన తోటి ఆటగాళ్లకు వాటర్ బాటిల్స్ అందించడం దగ్గరనుంచి, తన కెరీర్‌ను మెరుగుపరుచుకోవడానికి దేశవాళీ క్రికెట్లో గోవా జట్టుకు మారి కష్టపడటం వరకు ఆయన ప్రతి అడుగులోనూ ఎంతో నిజాయితీని చూపించారు. ఇక ఎప్పటికైనా తండ్రికి తగ్గ తనయుడిగా నిలబడతాడనే నమ్మకంతో అభిమానులు ఆశపడుతున్నారు. గొప్ప క్రికెటర్ కొడుకైనా, తన కష్టంతోనే ఈ స్థాయికి ఎదిగాడు.
క్రికెట్‌కు దూరంగా సాధారణ స్నేహితులు:
చాలామంది క్రికెటర్లకు ఎక్కువగా ఇతర ఆటగాళ్లతోనే స్నేహం ఉంటుంది. కానీ అర్జున్ టెండూల్కర్ ఫ్రెండ్స్ సర్కిల్ చాలా భిన్నంగా ఉంటుంది. తనకు క్రికెట్ ఆడే స్నేహితులు ఎవరూ లేరని, అసలు తన స్నేహితులకు క్రికెట్ గురించిన అవగాహనే ఉండదని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. ఇక దీనివల్ల మైదానం వెలుపల ఎటువంటి క్రికెట్ ఒత్తిడి లేకుండా, ఒక సాధారణ యువకుడిగా స్నేహితులతో సరదాగా గడపడానికి వీలవుతుందని ఆయన భావిస్తారు. ఈ సాదాసీదా స్వభావమే ఆయనను అందరికీ మరింత దగ్గర చేస్తుంది.
సొంతంగా ఎదుగుతున్న సారా టెండూల్కర్:
మరోవైపు, సారా టెండూల్కర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఆమె తన ఫ్యాషన్ మరియు అందంతో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటారు. విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉంటూ, సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ లో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక వెనుకబడిన ప్రాంతాల పిల్లలకు విద్య, క్రీడలు, వైద్య సదుపాయాలు అందించడంలో చురుగ్గా పాల్గొంటూ సమాజ సేవలో ముందున్నారు.
పిల్లల పెంపకంలో సచిన్ సక్సెస్:
ఇక ఇంతటి ఆస్తి, పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ సచిన్ తన ఇద్దరు పిల్లలను ఎంతో సాధారణంగా, సంస్కారవంతంగా పెంచారు. స్టార్ కిడ్స్ అయినప్పటికీ పిల్లలు ఇంత సింపుల్‌గా ఉండటం నిజంగా అభినందించాల్సిన విషయం. సహజమైన ఎదుగుదల కోరుకుంటూ, పిల్లలను కష్టపడే తత్వంతో పెంచిన సచిన్ విధానం ప్రతీ ఒక్కరికీ ఆదర్శం. ఎటువంటి గర్వం లేకుండా సాదాసీదా జీవితం గడుపుతున్న అర్జున్, సారా ప్రయాణం ఎందరికో స్పూర్తిని ఇస్తుంది.