• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆమెని కాపాడాలని చూసారో...

ఆమెని కాపాడాలని చూసారో మీకు అదే గతి .. హెచ్చరించిన ఏసీబీ

By - Tupaki Desk
Update: 2019-11-11 06:27 GMT
ప్రభుత్వ అధికారుల కి ఈ సమాజం లో ఒక గౌరవం ఉంది. కానీ , కొంత మంది చేసే తప్పుడు పనుల వల్ల మొత్తం ప్రభుత్వ  ఉద్యోగుల కే చెడ్డ పేరు వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ  ఉద్యోగులు ..లంచం లేనిదే మంచం దిగరు అనే స్థాయికి వచ్చేసింది. ఎదో అవసరాల నిమిత్తం ప్రభుత్వ ఆఫీసుల కి వచ్చిన వారు లంచం ఇస్తే కానీ మీ పని కాదు అని కొంత మంది నిర్మొహ మాటంగా చెప్పేస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు ..ప్రభుత్వ ఉద్యోగులు ఎలా మారిపోయారు. ఆలా అని అందరూ లంచం తీసుకుంటున్నారు అని అనడంలేదు.

లక్షణమైన జీతం ..సమాజం లో గౌరవం ..ఇన్ని ఉన్నా కూడా లంచానికి అలవాటు పడి కటకటాల పాలైన వారు చాలామంది ఉన్నారు. వారిని చూసైనా బుద్దితెచ్చుకోవాల్సిన అధికారులు ..మళ్ళీ అదే తప్పు చేసి జైలు కి వెళ్ళడాని కి సిద్ద పడుతున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ కర్నూల్ జిల్లా గూడురు తహశీల్దార్ హసీనాబీ ఏసీబీ కి అడ్డంగా  దొరికింది.  దీంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధం కాగా.. ఆ విషయం తెలుసుకున్న హసీనాబీ ఆ రోజు నుంచి పరారీలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఎవ్వరూ ఆశ్రమం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు.

పూర్తి వివరాలు చూస్తే ... గూడురుకు చెందిన సురేష్ అనే వ్యక్తి తన భూ సమస్య పరిష్కారం కోసం నెల రోజుల క్రితం తహశీల్దార్ హసీనా బీ ని ఆమె కార్యాలయంలో సంప్రదించాడు. దీనితో ఆమె రూ.8లక్షలు డిమాండ్ చేసింది. చివరకు రూ.4లక్షలకు ఇవ్వడాని కి ఒప్పుకున్నాడు. ఆ డబ్బుని  తీసుకునేందుకు మధ్య వర్తిని పంపింది. అదే సమయం లో ఏసీబీ అధికారులు దాడులు చేయ గా, సురేష్ నుంచి లక్ష రూపాయలు తీసుకుంటున్న మధ్య వర్తి మహబూబ్‌ బాషా ను రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న హసీనా బీ అప్పటి నుంచి పరారీలో ఉంది. ఇక మహబూబ్‌ భాషా ను శనివారం కోర్టు లో హాజరు పరచ గా ఈ నెల 22 వరకు రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆమెకు ఎవ్వరూ ఆశ్రమం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ కేసు లో హసీనాబీ ముద్దాయిగా ఉన్నారని, ఆమెకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిపై కూడా కేసులు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరో వైపు హసీనా బీ ఆచూకీ కోసం ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యం లో పలు బృందాలు ముమ్మరం గా గాలింపు చర్యలను చేపడుతున్నాయి.
Tags:    
  • Hassina b 
  • Andhra News 
  • Acb 
  • Anti Corruption Beauro 
  • Mohammad 
  • Telangana News 
  • Mro 
  • Tupaki News 

Similar News

ఏపీ జనం తీర్పు... గుప్పిట పట్టి ఉండిపోయిందా ?

2026-11-11 01:48 GMT

బొత్స కూతుర్ని ఓడించిన నీరజకే జెడ్పీ పట్టం ?

2026-11-11 01:47 GMT

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ?

2026-11-11 01:46 GMT

పవన్ కళ్యాణ్ విడాకులపై ’అంబటి’ రియాక్షన్ వైరల్

2026-11-11 01:45 GMT

డబ్బుల్లేవ్.. బీఆర్ఎస్‌కు ఇన్చార్జుల షాక్.. !

2026-11-11 01:44 GMT

విశాఖలో పెట్టుబడుల పండుగకి కౌంట్ డౌన్

2026-11-11 01:43 GMT

వైసీపీ బెస్ట్ డెసిషన్...కరెక్ట్ రూట్ లోనే !

2026-11-11 01:43 GMT

మంచు తెరలతో పర్యాటకులకు స్వాగతం

2026-11-11 01:42 GMT

సోనియా పుస్త‌కంలో తెగవెతికేసిన అంశాలు ఇవే!

2026-11-10 14:30 GMT

అనంతపురం వైసీపీ మేయర్.. కూటమి పక్కా ప్లానింగ్, ఆ ఒక్కరినీ లాగేస్తారా?!

2026-11-10 14:13 GMT

ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో ఊహించ‌ని ఘ‌ట్టం!

2026-11-10 13:12 GMT

ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ అత్యవసర భేటీ.. తమిళనాడులో ఏం జరగబోతోంది?

2026-11-10 12:56 GMT

Copyright @2026

Powered by Blink CMS