• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కెనడియన్ టెన్నిస్...

కెనడియన్ టెన్నిస్ బ్యూటీకి అదిరే పంచ్ ఇచ్చాడుగా!

By - Tupaki Desk
Update: 2019-09-29 05:23 GMT
అభిమానులు అంటే నిత్యం పొగిడేయటమే కాదు.. అప్పుడప్పుడు తాము అభిమానించే వారికి పంచ్ లు వేస్తుంటారు. చేయాల్సిన పని చేయకుండా.. అసలు మీద కంటే కొసరు మీదే ఎక్కువగా ఫోకస్ చేసే కొందరికి ఊహించని రీతిలో పంచ్ లు పడుతుంటాయి. గతంలో తాము అభిమానించే వారిని నెత్తిన పెట్టుకునే ఫ్యాన్స్ ఉండేవారు. కాలానికి తగ్గట్లు ఫ్యాన్స్ తీరులోనూ మార్పు వచ్చింది.

తాము అభిమానించే ప్రముఖులు అతి చేస్తుంటే భరించే స్థితిలో ఇప్పుడు వారి ఫ్యాన్స్ ఉండటం లేదు. అందుకు నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు. కెనడియన్ టెన్నిస్ బ్యూటీ ఎవ్ గెనీ బౌచర్డ్ గుర్తుందా? ఆట కంటే కూడా ఇతర విషయాల్లోనే ఆమె పేరు మీడియాలో దర్శనమిస్తుంటుంది.

సోషల్ మీడియాలో మస్తు యాక్టివ్ గా ఉండే ఈ భామ ఆడిన అద్భుతమైన ఆట గురించి చెప్పమంటే.. మాటల కోసం వెతుక్కోవాలి. కానీ.. ఈ అమ్మడికి సంబంధించి విషయాలు చెప్పమంటే.. పెద్ద లిస్టే చెప్పుకొస్తారు. అందులో ముఖ్యమైంది.. సోషల్ మీడియాలో ఒకసారి సూపర్ బౌల్ మీద బెట్ కట్టి ఓడిపోయిన ఈ భామ.. ఒక అపరిచిత వ్యక్తితో డేటింగ్ కు వెళ్లాల్సి వచ్చింది. ఆ ఉదంతంతో ప్రపంచవ్యాప్తంగా అమ్మడి పేరు మారుమోగింది.

తాజాగా ట్విట్టర్ లో అనవసరమైన ప్రశ్న వేసి.. ఫ్యాన్స్ నుంచి వరుస పంచ్ లు పడేలా చేసుకుంది. ఆర్డర్ చేసేందుకు మంచి టేస్ట్ ఉన్న పిజ్జా ఏదంటూ బౌచర్డ్ ట్వీట్ కు పాజిటివ్ కంటే నెగిటివ్ సమాధానాలే వచ్చాయి. అందులో కొన్ని పరమ నాటుగా ఉండి.. అమ్మడి ఇగోను హర్ట్ చేసేలా ఉన్నాయని చెప్పాలి.

నాకు ఫోన్ చేస్తే నేనే తీసుకొస్తానని ఒకరంటే.. ముందు పిజ్జా కాదు.. ఆట మీద ఫోకస్ పెట్టు అని మరొకరు.. ముందు నువ్వు గ్రాండ్ స్లామ్ తొలి రౌండ్ ను గెలిచేందుకు ప్రయత్నించు అంటూ ఇంకొకరు పంచ్ ల మీద పంచ్ లు వేయటం షురూ చేశారు. దీంతో.. బౌచర్డ్ మహా ఇబ్బందికి గురైందట.


Tags:    
  • Tennis Star 
  • Twitter 
  • Order Pizza 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS