• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేసీఆర్ కారణంగా తెలంగాణ...

కేసీఆర్ కారణంగా తెలంగాణ రావటం ఏంటి? పెద్దాయన ఘాటు వ్యాఖ్య

By - Tupaki Desk
Update: 2020-12-13 09:53 GMT
తెలంగాణ రాష్ట్రం తన వల్లనే ఏర్పడిందన్న మాట తరచూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత నోటి నుంచి రావటం తెలిసిందే. తెలంగాణకు సంబంధించి చాంపియన్ తానేనని చెప్పుకునే కేసీఆర్ వ్యాఖ్యల్ని తాజాగా ఒక పెద్దాయన తీవ్రంగా తప్పు పడుతున్నారు. కామెడీ కాకపోతే.. తెలంగాణ కేసీఆర్ కారణంగా రావటం ఏమిటి? అని మండిపడుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? ఎందుకంత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారన్న విషయంలోకి వెళితే..

తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో 1969లో జరిగిన ఉద్యమాన్ని ఒక ల్యాండ్ మార్కుగా చెబుతారు. తొలిసారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున తెర మీదకు వచ్చింది. ఆ సమయంలో ఉద్యమంలో పాలు పంచుకున్న వారంతా కలిసి 1969 ఉద్యమకారుల సమితిని ఏర్పాటు చేశారు. ఆ సమితికి అధ్యక్షుడిగా మేచినేని కిషన్ రావు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదన్న ముఖ్యమంత్రి మాటల్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

‘అసలు కేసీఆర్ ఉద్యమకారుడు కాదు. తన వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పటం హాస్యస్పదంగా ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లోనే బీజం పడింది. తెలంగాణ సాధన సమితి.. తెలంగాణ తల్లి ఇలా వందలాది ఉద్యమ సంస్థలు ఏర్పడి పోరాటం చేశాయి’ అని చెప్పారు. అప్పట్లోనే 369 మంది ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేసిన కిషన్ రావు.. ‘మలిదశ ఉద్యమంలో మంత్రి హరీశ్ రావు మధ్యవర్తిత్వం వహించగా.. ఉద్యమ సంస్థలన్ని ఒక్కదగ్గరకు చేరాయి. కాళోజీ నారాయణరావు సలహాతో అందరూ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశాం. కేసీఆర్ అధ్యక్షుడిగా.. ప్రధాన కార్యదర్శిగా నేను వ్యవహరించాం’ అని వెల్లడించారు.

విద్యార్థులు.. విద్యార్థి సంఘాలు.. న్యాయవాదులు ఇలా అన్ని వర్గాల వారు తెలంగాణ కోసం పోరాడారని.. వారందరి పోరాటాల ఫలితమే తెలంగాణ ఏర్పడిందన్న విషయాన్ని ఆయన గర్తు చేయటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర సాధన తన ఒక్కడి కారణంతోనే అన్న క్రెడిట్ కేసీఆర్ కు ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరని చెప్పాలి. మరి.. దీనిపై గులాబీ బాస్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.



Tags:    
  • latest news 
  • Trend 
  • Latest Updates 
  • Trending news 

Similar News

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

Copyright @2026

Powered by Blink CMS