జ‌గ‌న్ బామ్మ‌ర్ది అడ్డాలో టీడీపీ గెలుపు!

Update: 2021-02-15 15:55 GMT
రాష్ట్రంలో తొలి రెండు ద‌శ‌ల్లో జ‌రిగిన‌ పంచాయ‌తీ ఎన్నిక‌లు.. అధికార పార్టీకి అనుకూలంగా వ‌చ్చాయ‌ని అనుకున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే... టీడీపీకి చిత్ర‌మైన విజ‌యాలు ల‌భించాయి. అంతేకాకుండా.. వైసీపీకి ప‌ట్టున్న చోట‌.. మ‌రీ ముఖ్యంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోనూ టీడీపీ పుంజుకుంది. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ బామ్మ‌ర్ది.. న‌రేన్‌ రామాంజుల రెడ్డి అడ్డాలోనే టీడీపీ గెలుపు గుర్రం ఎక్కడం గ‌మ‌నా ర్హం. దీంతో ఒక్క‌సారిగా రాజ‌కీయ నేత‌ల అటెన్ష‌న్ అంతా కూడా అటువైపు మ‌ళ్ల‌డం గ‌మ‌నార్హం.

క‌డ‌ప జిల్లాలో కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల్లో 175 పంచాయతీలకు రెండో విడతలో ఎన్నికలు ముగిసాయి. 40 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 135 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కమలాపురం నియోజకవర్గంలో 71 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 44 పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు పోటీ చేశారు. వీటిలో 22 పంచాయతీలు అంటే 21.15 శాతం స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధానంగా కమలా పురం ఎమ్మెల్యే రవీంద్రనాథ రెడ్డి తనయుడు నరేన్‌ రామాంజులరెడ్డికి మంచి ప‌ట్టున్న సీకే దిన్నెలో టీడీ పీ మ‌ద్ద‌తు దారు విజ‌యం సాధించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

సీకే దిన్నె మేజ‌ర్ పంచాయ‌తీ. వాస్త‌వానికి జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ బామ్మ‌ర్ది.. న‌రేన్ రామాంజుల రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. సో.. ఇక్క‌డ ఆయ‌నకు గ‌ట్టి ప‌ట్టుంది. అలాంటి చోట‌.. టీడీపీ మ‌ద్ద‌తు దారు.. విజ‌యం సాధించ‌డం సంచ‌ల‌నంసృష్టించింది. మొత్తంగా మొదటి, రెండు విడతల్లో 202 స్థానాల్లో టీడీపీ పోటీ చేసి 49 పంచాయతీల్లో విజయం సాధించింది. అందులో సీకె దిన్నె, పోరుమామిళ్ల మేజర్‌ పంచాయతీలను కైవసం చేసుకుంది. చింతకొమ్మదిన్నె మేజర్‌ పంచాయతీని టీడీపీ 64 ఓట్ల తేడాతో చేజిక్కించుకోవడం  ఆ పార్టీలో జోష్ నింపింది.  మొత్తానికి జ‌గ‌న్ ఇలాకాలో .. టీడీపీ పాగా వేయ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News