జేడీ రాజీనామా.. పవన్ కు టీడీపీ సపోర్ట్

Update: 2020-01-31 06:23 GMT
జనసేన టీ కప్పులో తుఫాను వచ్చిన సంగతి తెలిసిందే. జనసేన నాయకుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా జనసేనకు గుడ్ బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖలో పవన్ కళ్యాణ్ పై కాస్తా ఘాటుగానే విమర్శలు చేశారు. పవన్ రాజకీయాలకే అంకితమని చెప్పి.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించడం ఏంటని..ఆయన లో నిలకడ లేదని.. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్టు జేడీ పేర్కొన్నారు.

అయితే జనసేన కు జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పిన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాశమైంది. ఈ విషయంలో తాజాగా టీడీపీ కూడా స్పందించింది. అనూహ్యంగా టీడీపీ జనసేనాని పవన్ కు మద్దతు తెలుపడం హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా మాజీ జేడీ లక్ష్మీ నారాయణ రాజీనామాపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ కు పూర్తి సపోర్టు చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాల్లో నటించారని.. అలాంటప్పుడు పవన్ నటిస్తే రాష్ట్రానికి వచ్చిన నష్టమేంటని ’ ప్రశ్నించారు. రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ పవన్ కు పూర్తి మద్దతు ప్రకటించారు.
Tags:    

Similar News