భారత్ గొంతు ఎండిపోతుంది...మురుగు నీరే శరణ్యమా ?

భారత దేశ జనాభా ప్రపంచంలోనే అధికం అన్నది తెలిసిందే. చైనాను కూడా భారత్ దాటేసింది. తాజా జనాభా లెక్కలు బయటకు వస్తే కనుక భారత్ అసలైన జనాభా ఎంతో తెలుస్తుంది.

Update: 2026-06-30 19:00 GMT

భారత దేశ జనాభా ప్రపంచంలోనే అధికం అన్నది తెలిసిందే. చైనాను కూడా భారత్ దాటేసింది. తాజా జనాభా లెక్కలు బయటకు వస్తే కనుక భారత్ అసలైన జనాభా ఎంతో తెలుస్తుంది. ఒక అంచనా మేరకు 150 కోట్లకు చేరువ కూడా కావచ్చు అంటున్నారు. మరి ఈ లెక్క చూస్తే మొత్తం ప్రపంచ జనాభాలో 18 శాతం వాటా భారత్ ది అని అంటున్నారు. నీటి వనరులు చూస్తే ప్రపంచ జనాభాలో కేవలం నాలుగు శాతం మాత్రమే భారత్ లో ఉన్నాయి. అంటే జనాభా వేగంగా ఎంత పెరిగితే అంత తొందరగా మన నీటి వనరులు కరిగిపోతాయని అర్ధం అవుతోంది కదా.

అతి పెద్ద జల సంక్షోభం :

మరో నాలుగేళ్ళ నాటికి అంటే 2030 వచ్చే సమయానికి భారత్ లో నీటి వనరులు అప్పటి జనాభా డిమాండుకు తగిన విధంగా నీటిని సరఫరా చేయలేవని నివేదికలు చెబుతున్నాయి. ఏ ఏటికి ఆ ఏడు జనాభా పెరుగుతూ పోతోంది. అదే సమయంలో నీటి వనరులు మాత్రం అందరికీ అందేలా అయితే ఉండవని పీఎల్ క్యాపిటల్ నివేదికలో అసలైన నిజాలు వెల్లడి అయ్యాయి. ఇలా వచ్చే దశాబ్దంలో నీటి సంక్షోభం పెద్ద ముప్పుగా భారత్ కి పరిణమిస్తుందని అంటున్నారు. దీంతో ఉన్న జనాలకు నీటి వనరులు ఎక్కడ నుంచి అంటే ఇంత పెద్ద సమస్యకు జవాబు కూడా అక్కడే కనుగొనాలని అంటున్నారు.

ముగురు నీరు శుద్ధి చేసుకుని :

అపుడు మనం వాడే నీటిని రీసైక్లింగ్ చేసుకోవడం అలాగే శుద్ధి చేసుకోవడం ద్వారా మాత్రమే దాహాన్ని తీర్చుకుని ప్రాణాలను కాపాడుకోగలమని నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల నీటి సరఫరాకు రెట్టింపు డిమాండ్ ఉన్న నేపధ్యంలో కొత్త రకం మార్గాలను అన్వేషించాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ రోజున చూస్తే దేశంలో రోజుకు 72 వేల మిలియన్ లీటర్లకు పైగా మురుగు నీరు ఉత్పత్తి అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ముగురు నీరు ఉంటే దానిని శుద్ధి చేసే సామర్ధ్యం మాత్రం తక్కువగా ఉంది. అయితే భవిష్యత్తులో నీటి కొరత తీవ్రమైనపుడు అది అనివార్యం అవుతుందని అంటున్నారు. దాంతో కొత్త ఆలోచనలు కొత్తగా నీటి మీద వ్యాపారం చేసే పరిశ్రమలు పుట్టుకుని వస్తాయని అంటున్నారు.

లాభసాటి వ్యాపారంగా :

మురుగు నీరు శుద్ధి చేసి మంచి నీరుగా స్వచ్ఛంగా మార్చి ఇచ్చే వ్యాపారానికి 2030 తరువాత మంచి డిమాండ్ వస్తుందని పీఎల్ క్యాపిటల్ నివేదిక చెబుతోంది. అంటే నీటి సమస్యల నుంచే కొత్త బిజినెస్ స్టార్ట్ అవుతుంది అన్న మాట. అది మామూలు వ్యాపారం కూడా కాదు అని అంటున్నారు. కేవలం నీటి రంగంలో 20 నుంచి పాతిక లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేలా ఈ వ్యాపారం భారీ ఎత్తున విస్తరిస్తుందని అంటున్నారు. ఆనాటికి మరింతగా పెరిగే పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, భూగర్భంలో క్షీణత, వ్యవసాయానికి నీటి వాడకం వంటి వాటి ద్వారా మరింతగా నీటి అవసరాలు ఏర్పడుతాయి అని అంటున్నారు. అంతే కాదు డేటా సెంటర్లు, సెమీకండక్టర్ల, ఎలక్ట్రానిక్స్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి వినూత్నమైన పరిశ్రమలకు పూర్తిగా స్వచ్చమైన నీరు అవసరం కావడంతో పరిశ్రమలకు కూడా నీఎరు పెద్ద ఎత్తున కావాల్సి ఉంది. మరి అపుడు నీటి వ్యాపారం కంటే గొప్ప బిజినెస్ ఏమి ఉంటుందని పీఎల్ క్యాపిటల్ నివేదిక అంటోంది.

శుద్ధి చేసే నీటితోనే :

అపుడు భారత్ లోని సమాజం మొత్తం శుద్ధి చేసిన నీటి వాడకం మీదనే ఎక్కువగా ఆధారపడుతుందని అంటున్నారు. దాంతో ఈ రంగంలో ఎంత బాగా పెట్టుబడులు పెడితే అంతలా బిజినెస్ టాప్ రేంజిలో సాగుతుందని అంటున్నారు. ఎందుకంటే నీరు లేనిదే మనిషి లేడు, పరిశ్రమలు లేవు, ఏ ఇతర వ్యాపకాలు లేవు కాబట్టి ఆనాటికి ఇదే అతి పెద్ద పెట్టుబడి రంగం అని పీఎల్ క్యాపిటల్ నివేదిక ఘంటాపధంగా చెబుతోంది. ఈ నివేదిక మురుగు నీటి నుంచి స్వచ్చమైన నీరుని తీసే పరిశ్రమల గురించి పెట్టుబడుల గురించి మాట్లాడుతోంది. అయితే నీటి కొరత దేశాన్ని పట్టి పీడిస్తుంది అన్న హెచ్చరికలు మాత్రం ప్రజానీకాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అపుడు నీరు కూడా తాగేందుకు మాత్రమే కాదు అన్ని రకాల అవసరాలకు కొనుక్కోవాల్సి వస్తుందని కూడా కలవరం కూడా ఏర్పడుతోంది.

Tags:    

Similar News